తెలంగాణలో భూ రికార్డుల డిజిటలైసెషన్ లో భాగంగా తీసుకొచ్చిన ధరణిని పోరాటాలతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు , ధరణి పోర్టల్ లో సమస్యను తగ్గించడానికి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది , సాంకేతికపరమైన సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కొంతమంది ఈ ధరణి పోర్టల్ ని అభినందిస్తున్నారు, మరికొంతమంది విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ ఐతే తాము అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని అన్నారు.
ఈ ధరణి పోర్టల్ లో రైతుల భూముల వివరాలు సరిగా లేవు. ధరణి అందించిన సమాచారంపైనే అధికారులు ఆధారపడుతుండడంతో రుణాలు, ఇతర ప్రయోజనాలను పొందే విషయానికి వస్తే సమస్య ఎదురవుతోంది. సాంకేతిక సమస్యలు లేక సర్వర్ డౌన్ అయిందని పేర్కొంటూ అధికారులు రైతులను ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితి రైతులలో పెరుగుతున్న నిరుత్సాహానికి దారితీసింది, భవిష్యత్తులో జరిగే ఎన్నికలలో ప్రభుత్వానికి వారి మద్దతుపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది.
ప్రభుత్వం స్పందించి ధరణి పోర్టల్‌లో గుర్తించిన 40కి పైగా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సమస్యలను పరిష్కరించగలిహితే, దాదాపు 5 లక్షల మంది రైతులకు మేలు జరగనుంది. భూ యాజమాన్య హక్కులను పొందే విషయంలో ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. పాస్ పుస్తకాల్లో తప్పులు, సర్వే నంబర్ల నమోదు, ఖాతా నంబర్లు, ఇనాం భూముల హక్కులు, నాలా భూములు ఇలా ఎన్నో సమస్యలు పరిష్కరించేందుకు ఇప్పుడు అధికారులు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి..
రైతుల ఖాతాల్లో జమ కాకుండా రుణమాఫీ సొమ్ము వెనక్కి.. కారణం ఇదే?
సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీని ఏర్పాటు చేసి, 34 కీలక సమస్యలను వివరిస్తూ, పరిష్కార మార్గాలను సూచిస్తూ నివేదికను రూపొందించారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా పేరుమార్పులు, కొత్త ఖాతాలు, సర్వే నంబర్ల తొలగింపు, అసైన్డ్ భూములు, ఎన్‌ఓసీలు, భూమి స్వభావంలో మార్పులు, ఏరియా సర్దుబాట్లు, మిస్సింగ్ నంబర్లు వంటి పలు సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం టీఎం 33 మాడ్యూల్‌ను ప్రవేశపెట్టింది.
ధరణి పోర్టల్ యొక్క లక్ష్యం భూమి రికార్డులను డిజిటలైజ్ చేయడం, అవినీతిని తగ్గించడం మరియు భూమి లావాదేవీలను మరింత పారదర్శకంగా మరియు సమర్థవంతంగా చేయడం. పోర్టల్ పౌరులు భూమి మరియు ఆస్తి వివరాలను యాక్సెస్ చేయడానికి, భూమి యాజమాన్య ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి, ఆస్తి పత్రాలను నమోదు చేయడానికి మరియు ఆన్‌లైన్‌లో స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజులను చెల్లించడానికి వీలు కల్పిస్తుంది.
ఇది కూడా చదవండి..
Share your comments