ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతీ విద్యార్థి చదుకోవాలనే ధ్యేయంతో జగనన్న విద్యాదివేన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కాలర్షిప్ పథకం ద్వారా విద్యార్థులకు చదువుకోవడానికీ మరియు ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం ఆర్ధికంగా సహాయం చేస్తుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం పూర్తి రీయింబర్స్మెంట్ను అందిస్తుంది. ఈ పథకానికి సంబంధించిన నాలుగో విడత డబ్బులను విడుదల చేయనుంది.
విద్యాదివేన పథకం యొక్క నాల్గవ విడత డబ్బును ఈ నెల అనగా మర్చి 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అకౌంటుల్లోకి జమ చేయనున్నారు. రేపు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సభ నిర్వహించనున్నారు. ఆ సభలో లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లోకి బటన్ నొక్కి విద్యాదివేన డబ్బులను జమచేయనున్నారు.
వాస్తవానికి ఈ రోజే డబ్బులను జమ చేయవలసి ఉంది, కానీ సభావేదిక పక్కనే ఉన్న పాఠశాలలో పరీక్షలు జరగడంతో 19వ తేదికి మార్చారు. ఈ విద్యాదివేన పథకానికి అర్హులైన విద్యార్ధులందరికి పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది.
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దిన విషయం మనకి తెలిసందే. ఇంజనీరింగ్, మెడిసిన్, లిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని.. ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది.
ఇది కూడా చదవండి..
చిరుధాన్యాలతోనే ఆరోగ్యకరమైన జీవనం - శ్రీ అన్న కాన్ఫరెన్స్ లో ప్రధాని
రేపు సభాకార్యక్రమంలో 700 కోట్ల రూపాయలను నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో వేయనున్నట్లు తెలిపారు. గడిచిన మూడేళ్ళలో ఈ పథకం ద్వారా 31.4 లక్షల మంది విద్యార్థులు లబ్ది పొందారు. రేపటి సభలో విద్యార్థుల ఖాతాల్లో జమ చేసే 700 కోట్ల రూపాయలను 11 లక్షల మంది విద్యార్థులకు అందించనున్నారు. ఇటీవలి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా విద్య కొరకు అధిక మొత్తంలో నిధులు కేటాయించారు.
ఇది కూడా చదవండి..
Share your comments