News

ప్రభుత్వం రైతులకు క్రాప్‌ బుకింగ్‌తో భరోసా.. ఇప్ప్పుడే నమోదు చేసుకోండి..

Gokavarapu siva
Gokavarapu siva

రైతులు పండించిన పంటలను వారు అమ్ముకుందుకు ప్రభుత్వం వారికి ఈ క్రాప్ బుకింగ్ చేస్తుంది. రైతులు పండించిన ప్రతీ పంట ఈ క్రాప్‌ బుకింగ్‌ చేసేందుకు వ్యవసాయశాఖ పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. ఈ క్రాప్ బుకింగ్ కి రైతులు తమ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాల ద్వారా నమోదు చేసుకోవచ్చు. వ్యవసాయశాఖకు సంబంధించిన ఏ పథకం అమలు చేయాలన్నా ఈ క్రాప్‌ బుకింగ్‌ ఆధారంగా చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ప్రభుత్వం కూడా పంటలు పండించే ప్రతి రైతు ఈ క్రాప్ బుకింగ్ తప్పనిసరిగా చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం ఈ క్రాప్‌ పంట నమోదు ప్రామాణికంగా తీసుకోనుంది. కాకినాడ జిల్లాలో ఇప్పటివరకు 17, 828 ఎకరాల్లో ఈ క్రాప్‌ పంట నమోదు పూర్తయ్యింది. దీనిని 100 శాతం పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.

రైతులకు ఇన్సూరెన్సు వర్తించాలంటే పంట నష్టం సంభవించిన రైతు ఈ క్రాప్‌ బుకింగ్‌ తప్పనిసరిగా చేసుకోవాలి. రైతులు గనుక ఈ క్రాప్ బుకింగ్ చేయించకపోతే వారికి ఎటువంటి ఇన్సూరెన్సు వర్తించే అవకాశం లేదు. ప్రభుత్వం నియమించిన గ్రామ వ్యవసాయ సహాయకులు రైతుల పంట వద్దకు వెళ్లి ఫొటోలు తీసి ఈ క్రాప్‌ నమోదు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..

ఇయ్యాల రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు .. ఈ జిల్లాలకు యెల్లో అలెర్ట్ !

రైతులు ఈ క్రాప్‌ బుకింగ్‌ ఆధారంగా బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నారు. చాలామంది దళారులు పంటలు సాగు చేయకుండా రుణాలు పొందుతున్నారు. దీంతో నిజమైన రైతులకు రుణాలు ఇచ్చేందుకు వీలు లేకుండా పోతోంది . దీనిని గుర్తించిన ప్రభుత్వం ఆన్‌లైన్‌లో వారు ఎంత విస్తీర్ణంలో ఏఏ పంటలు సాగు చేశారో గుర్తించి, దాని ఆధారంగా వారికి రుణాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇకపై రైతు భరోసా పథకం కూడా ఈ క్రాప్‌ బుకింగ్‌ ఆధారంగానే వేసేందుకు కసరత్తు చేస్తోంది వ్యవసాయశాఖ. దీంతో నిజమైన రైతులకు రైతు భరోసా పథకం లబ్ధి చేకూరే వీలుంటుంది.

ఇది కూడా చదవండి..

ఇయ్యాల రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు .. ఈ జిల్లాలకు యెల్లో అలెర్ట్ !

Share your comments

Subscribe Magazine

More on News

More