న్యూఢిల్లీ, మార్చి 23:దేశంలో 2014 నుంచి ఇప్పటివరకు దాదాపు 1,956 రకాల అధిక దిగుబడులను అందించే , చీడ పీడలను తట్టుకునే విత్తన రకాలను విడుదల చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి మంగళవారం లోక్సభలో తెలిపారు.
ఇందులో 24 రకాల తృణధాన్యాలు (వరి 442, గోధుమ 127), 291 రకాల నూనెగింజలు, 304 రకాల పప్పుధాన్యాలు, 239 రకాల నార మరియు వాణిజ్య పంటలు, 118 రకాల మేత పంటలు, 64 రకాల చెరకు మరియు 16 రకాల ఇతర పంటలతో సహా మొత్తం 1,956 అధిక దిగుబడి,చీడ - పీడలను తట్టుకునే విత్తన రకాలను విడుదల చేసినట్లు అయన తెలిపారు.
వ్యవసాయ విత్తనాల ఉత్పత్తి మరియు పంపిణీ కోసం వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుందని చౌదరి తెలిపారు.
వీటిలో 1,600కు పైగా రకాలు శీతోష్ణస్థితిని తట్టుకునే పంటలు అని భవిష్యత్ విత్తన ప్రణాళిక కోసం, భవిష్యత్తులో విత్తనాల లభ్యతను నిర్ధారించడానికి విత్తన రోలింగ్ ప్రణాళికను సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది.
దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు సబ్ మిషన్ ఆన్ సీడ్స్ అండ్ ప్లాంటింగ్ మెటీరియల్స్ (ఎస్ఎంఎస్పీ), నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం), రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) వంటి వివిధ పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు , కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్థిక సహాయం అందిస్తోంది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) 25 ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ (ఏఐసీఆర్పీలు), ఆల్ ఇండియా నెట్వర్క్ ప్రాజెక్ట్స్ (ఏఐఎన్పీలు), మరో ఏడు ప్రాజెక్టులతో సహా వివిధ పరిశోధన కార్యక్రమాలను 732 కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్నట్లు చౌదరి తెలిపారు.
Share your comments