News

రైతుల ఖాతాలో డబ్బు జమ.

KJ Staff
KJ Staff
Farmer
Farmer

ఏపీలో రైతులందరికీ శుభవార్త. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రబీ 2019 లో అర్హత పొందిన రైతులకు సున్నా వడ్డీ రాయితీ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది.

అర్హులైన ప్రతి ఒక్కరికీ వడ్డీ రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 6, 27, 908 మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. వీరందరికీ తమ తమ ఖాతాల్లో ఈ మొత్తాన్ని ఏప్రిల్ 20 నుంచి జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ లెక్కన రైతులందరికీ కలిపి రూ. 128.47 కోట్ల లబ్ధి చేకూరనుంది. వ్యవసాయ అవసరాల కోసం లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకొని సకాలంలో వాయిదాలు చెల్లించిన రైతులకు వారు కట్టిన వడ్డీ మొత్తం అంటే నాలుగు శాతం మొత్తాన్ని వడ్డీ లేని రుణ పథకం కింద బ్యాంకులకు చెల్లించేది ప్రభుత్వం.

రైతులు రుణాలు సకాలంలో చెల్లించినా రెండు మూడేళ్లకు ఒకసారి వడ్డీ చెల్లించేది ప్రభుత్వం. ఈ మొత్తాన్ని మరోసారి రుణాలు ఇచ్చేటప్పుడు సర్దుబాటు చేసి బ్యాంకర్లు రైతులకు రుణాలు అందించేవారు.

కానీ ఇప్పుడు ఈ మొత్తాన్ని నేరుగా రైతుల అకౌంట్లకే ట్రాన్స్ ఫర్ చేయడానికి నిర్ణయించుకుంది ప్రభుత్వం. అందుకే లక్షలోపు పంట రుణాలపై వారు చెల్లించిన వడ్డీని వారికి అందించేందుకు వైఎస్సాఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించింది. ఖరీఫ్ 2019 లో మొత్తం నలభై మూడు లక్షలకు పైగా రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. వీరిలో 25, 96, 840 మంది రైతులు లక్ష లోపు రుణాలు తీసుకున్నారు. వీరిలోనూ నిర్ణీత గడువు లోపు చెల్లించిన వారు కేవలం 14. 25 లక్షల మందే. వీరంతా ఈ పథకానికి అర్హత సాధించారు. వీరందరికీ గత నవంబర్ లో ప్రభుత్వం 289.41 కోట్ల రూపాయలను ప్రభుత్వం వారి వారి ఖాతాల్లో జమ చేసింది.

ఇప్పుడు తాజాగా రబీ సీజన్ కి గాను వడ్డీ తిరిగి చెల్లించిన వారికి డబ్బులు వారి ఖాతాల్లో వేయనుంది ప్రభుత్వం. 2019 రబీ సీజన్ లో 28,08,830 మంది రైతులు రుణాలు పొందారు. వీరిలో లక్షలోపు రుణాలు తీసుకున్న వారి సంఖ్య పదహారు లక్షలకు పైగానే ఉన్నా.. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించిన వారు మాత్రం 6, 27,908 మంది మాత్రమే ఉండడం గమనార్హం. వీరి ఖాతాల్లోకి ప్రభుత్వం డబ్బు జమ చేయనుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వడ్డీ లేని రుణ పథకం కింద పడ్డ బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించింది. ఇందులో భాగంగా సుమారు 35 లక్షల మంది లబ్దిదారుల ఖాతాల్లో 789.36 కోట్లను జమ చేసింది. దీంతో పాటు పావలా వడ్డీ కింద ఉన్న బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించనుంది. ఈ సందర్భంగా బ్యాంకర్లు అప్ లోడ్ చేసిన జాబితాలోని ప్రతి లబ్దిదారు ఖాతాలో డబ్బులు జమ కానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 20 వ తేదీన సీఎం జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలు కానుంది. ఆ తర్వాత వారం రోజుల్లో ఈ మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.

https://telugu.krishijagran.com/news/on-may-13-rythu-barosa-money-was-deposited-in-the-farmers-accounts/

https://telugu.krishijagran.com/news/telangana-to-introduce-new-scheme-on-april-27/

Share your comments

Subscribe Magazine

More on News

More