సకల పోషక విలువలు సమృద్ధిగా ఉన్న గోధుమ గడ్డి జ్యూస్ ను ప్రతిరోజు ఉదయాన్నే క్రమం తప్పకుండా తాగితే మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి. ప్రస్తుత కాలంలో గోధుమగడ్డి జ్యూస్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే చాలా మందికి గోధుమ గడ్డి జ్యూస్ అందుబాటులో ఉండదు. కానీ గోధుమ గడ్డి పౌడర్ మార్కెట్లో నిత్యం అందుబాటులో ఉంటుంది. ఇంతటి డిమాండ్ కలిగిన గోధుమ గడ్డి పౌడర్ ను మనం ఇంట్లోనే
తయారు చేసి విక్రయిస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందవచ్చు.
గోధుమ గడ్డి పెంచడం పెద్ద కష్టమైన పనేం కాదు మన ఇంట్లోనే సులభంగా పెంచుకోవచ్చు. మొదట నాణ్యమైన గోధుమలను సేకరించి ఆరు నుండి ఎనిమిది గంటల పాటు నానబెట్టిన తర్వాత శుభ్రమైన కాటన్ వస్త్రంలో మొలక కట్టి ఉంచితే ఒకటి లేదా రెండు రోజులకు గోధుమ మొలక కనిపిస్తుంది. మొలక వచ్చిన గోధుమలను మనం మట్టితో నింపుకున్న కుండీల్లో గాని ట్రేలలో గాని సమానంగా వేసుకొని సూర్యరశ్మి తక్కువగా పడే చోటా ఉంచి ప్రతిరోజు తగినన్ని నీరు అందిస్తే వేసిన పది రోజులకు గోధుమ గడ్డి 8-10 అంగుళాల ఎత్తుకి పెరుగుతుది.
ఈ సమయంలో గడ్డిని కోసి 1-2 రోజు పాటు నీడలో ఆరబెట్టి బాగా డ్రై అయిన తర్వాత మిక్సీలో వేస్తే ఆరోగ్యకరమైన గోధుమ గడ్డి పౌడర్ తయారవుతుంది. గోధుమ గడ్డి పౌడర్ను గాలి తగలకుండా ప్యాక్ చేసి ఆయుర్వేద షాపులు, మెడికల్ షాపులు, కిరాణా స్టోర్స్, సూపర్‌మార్కెట్లలో అమ్మవచ్చు. ప్రస్తుత మార్కెట్‌లో గోధుమగడ్డి పౌడర్ 1 కిలో దాదాపు 1500 వరకు పలుకుతోంది. అధిక మొత్తంలో గోధుమ గడ్డిని పెంచి పౌడర్ రూపంలో అమ్మ కున్నట్లయితే నెలకు 25 నుంచి 30 వేల దాకా తక్కువ పెట్టుబడితో ఆదాయాన్ని పొందవచ్చును ఇప్పటికే ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన వారు చెబుతున్నారు.
Share your comments