భారత దేశం గూడ్స్ సర్వీస్ టాక్స్(జిఎస్టి) ప్రతి నెలా భారీగా వాసులు అవుతుంది. మన రోజువారీ కొనే అనేక వస్తువుల మీద జిఎస్టి పడుతుంది. ఈ జిఎస్టి లో సగభాగం కేంద్ర ప్రభుత్వానికి మరికొంత భాగం రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది. మనం కొనే పార్థి వస్తువు పైన 18% వరకు జిఎస్టిని కట్టాలి. మార్చ్ నెలలో జిఎస్టి వసూళ్లు భారీగా జరిగినట్లు ఆర్ధిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మార్చ్ నెలలో మొత్తం 1.78 లక్షల కోట్లు జిఎస్టి వాసులైనట్లు ఆర్ధిక మంత్రిత్వ శాఖ తెలిపింది. క్రిందటి సంవత్సరం మార్చితో పోల్చుకుంటే ఇది 11.5% ఎక్కువ. ఇప్పటివరకు అత్యధికంగా 2023 ఏప్రిల్ లో 1.87 లక్షల కోట్లు వాసులు కాగా, జిఎస్టి ప్రారంభించిన తర్వాత రెండో అతిపెద్ద వాసులుగా ఈ సంవత్సరం మార్చిలో వసూలైన జిఎస్టి నిలిచింది.
మార్చ్ నెల జిఎస్టి లో సెంట్రల్ జిఎస్టి రూ. 34,532 కోట్లు వసూలైంది మరియు స్టేట్ జిఎస్టి రూ. 43,746 కోట్లు ఖజానాకు చేరింది. ఇంకా ఐజిఎస్టి వివరాలను చూసుకుంటే రూ. 87,947 కోట్ల వసూలయ్యాయి. గడిచిన ఆర్ధిక సంవత్సరానికి మొత్తం రూ. 20.14 లక్షల కోట్లు జిఎస్టి రూపంలో వసూలుకాగా, ఇది 2022-2023 ఆర్ధిక సంవత్సరంకంటే 11.7 అధికం కావడం క్రమంగా పెరుగుతున్న జిఎస్టి వసూళ్ళను తెలియపరుస్తుంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో జిఎస్టి వసూళ్ల గురించి చూసుకున్నట్లైతే, ఆంధ్ర ప్రదేశ్లో జిఎస్టి వసూళ్లు 16 శాతానికి పెరిగాయి. ఆంధ్ర ప్రదేశ్లో రూ. 3,532 కోట్ల నుండి రూ. 4,082 కోట్లకు జిఎస్టి ఎగబాకింది. మరోవైపు తెలంగాణలోనూ జిఎస్టి వసూళ్లు 12 శాతం పెరిగాయి. క్రితం సంవత్సరం మార్చ్ నెలలో 4,804కోట్లు వసూలు కాగా ఈ ఏడాది మార్చికి 5,399కోట్లకు పెరిగాయని కేంద్ర ఆర్ధిక శాఖ వెల్లడించింది.
-
రిసర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90వ వార్షికోత్సవ వేడుకలు:
Share your comments