'హర్ ఘర్ తిరంగా'లో భాగంగా కృషి జాగరణ్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో కృషి జాగరణ్ స్థాపకుడు M.C డొమినిక్ మరియు కృషి జాగరణ్ బృందం తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు . ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగ సోమనిసీడ్స్ స్థాపకర్త K.V సోమని పాల్గొన్నారు ఈ సందర్భం అయన మాట్లాడుతూ చరిత్రలో స్వతంత్ర దినోత్సవానికి ఉన్న ప్రత్యేకతను ఆయన వెల్లడించారు .
దేశమంతా 75వ స్వాతంత్ర వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో ఒక్క రోజు మాత్రమే జరిగే వేడుకలు ఈ సారి రెండు, మూడు వారాలపాటు సాగనున్నాయి.
దీనిలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోంది. అందులోనూ ఈ నెల 13, 14, 15 తేదీల్లో వరుసగా మూడు రోజులు జాతీయ జెండా ఎగురుతుంది. దీంతో దేశవ్యాప్తంగా గతంలో ఎప్పుడూ లేనంతగా జాతీయ జెండాలకు డిమాండ్ పెరిగింది. కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు 20 కోట్లకు పైగా జాతీయ జెండాలు సిద్ధమయ్యాయి.
'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమం గురించి ప్రధాని ప్రకటించిన తర్వాతి నుంచి ఈ జెండాలు సిద్ధమయ్యాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం జెండా కోడ్లో మార్పులు తెస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. దీంతో ప్రతి ఒక్కరూ జెండాను తమ ఇంటిపై ఎగరేసేందుకు ఆసక్తి చూపుతున్నారని అధికారులు అంటున్నారు.
Share your comments