ఇటీవల కాలంలో మన స్వార్థ ప్రయోజనాల కోసం అడవులను విచ్చలవిడిగా నరికి వేయడంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతిని అడవులు అంతరించిపోవడంతో అడవి జంతువులు ఆహారం, నీటి కోసం పట్టణాలు, గ్రామాలపై దాడి చేస్తూ అవి ప్రమాదంలో పడటమే కాకుండా రైతులు కష్టపడి పండించిన పంటలను నాశనం చేస్తున్నాయి.అలాంటి కష్టమే ఇప్పుడు హుస్నాబాద్ రైతులకు వచ్చింది. అయితే వీరు ఈ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం ఎన్నుకున్నారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.
ఎన్నో సమస్యలను ఎదుర్కొని వ్యవసాయం మీద మమకారంతో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్న హుస్నాబాద్ రైతు సోదరులకు అడవి కోతుల రూపంలో మరో కష్టం వచ్చి పడింది. కోతులు గుంపులు గుంపులుగా వచ్చి పంటపొలాలను పీకి నాశనం చేయడంతో రైతు కష్టానికి ఫలితం లేకుండా పోతోంది.కోతుల స్వైరవిహారంతో విసిగిపోయిన హుస్నాబాద్ రైతులు వినూత్నంగా ఆలోచించి కొండ ముచ్చు బొమ్మల ఫ్లెక్సీలు తయారు చేయించి పొలాల మధ్యలో గట్ల మీద ఉంచడంతో కోతుల బెడద తగ్గిందని చెబుతున్నారు.
సహజంగా కోతులకు కొండ ముచ్చులు అంటే భయం ఎక్కువ. కొండముచ్చులు నివసిస్తున్న ప్రదేశంలో కోతులు అస్సలు వెళ్ళవు. దీన్ని గమనించిన రైతులు కోతులను తరిమివేయడానికి కొండముచ్చు ఫోటోలను ప్లెక్సీలతో పెద్దగా చేయించి పొలాల మధ్య ఉంచడంతో పంటలను సునాయాసంగా కాపాడుకో కలుపుతున్నారు. దీంతో పచ్చని పొలాల మధ్య కొండముచ్చుల పెద్దపెద్ద ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.
Share your comments