బ్యాంకింగ్ సేవలను విస్తరించేందుకు HDFC మరో ముందడుగు వేసింది బ్యాంకింగ్ సేవలను గ్రామా గ్రామానికి పరిచయం చేసే దిశగా నూతన ఆలోచనతో వ్యాను ద్వారా బ్యాంకింగ్ సేవల లను గ్రామగ్రామానికి అందించడానికి "బ్యాంక్ ఆన్ వీల్స్" ను తమిళనాడులోని విరుదునగర్‌లో ఈ సేవలను నేడు ప్రారంభించింది .
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన అత్యాధునిక 'బ్యాంక్ ఆన్ వీల్స్' వ్యాన్ సౌకర్యాన్ని తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఈరోజు ప్రారంభించనుంది, ఈ చొరవ ద్వారా బ్యాంకు కు సంబందించిన 21 సేవలను మారుమూల గ్రామ ప్రజలకు అందించనుంది . సమీప HDFC బ్యాంకు శాఖ నుండి 10 - 25 కి.మీ దూరంలో ఉన్న ఈ వ్యాను సందర్శించి సేవలను అందిస్తుంది . ప్రస్తుతానికి విరుదునగర్ జిల్లా మరియు చుట్టుపక్కల ఎంపిక చేసిన గ్రామాలకు వ్యాను బ్యాంకు ద్వారా బ్యాంకింగ్ సేవలు లభించనున్నాయి .
గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పంజాబ్ తర్వాత తమిళనాడు ఈ సేవలు కల్గిన ఐదో రాష్ట్రంగా అవతరించనుంది. ఈ సేవలను విరుదునగర్ వ్యాపారుల సంఘంలో మరియు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఒ శశిధర్ జగదీష్ జెండా ఊపి ప్రారంభించారు .
ఉద్యోగులు, పింఛన్‌దారులకు శుభవార్త.. 2.73 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ !
ఈ కార్యక్రమానికి అతిధులుగా సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మరియు RBB, గ్రామీణ బ్యాంకింగ్ హెడ్ అనిల్ భవ్నానీ మరియు సదరన్ బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్ సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నానున్నారు .
ఆర్‌బిబి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గ్రామీణ బ్యాంకింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మరియు హెడ్ అనిల్ భవ్నానీ మాట్లాడుతూ, “ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ఇంటి వద్దకు బ్యాంకింగ్‌ను తీసుకెళ్లడం మరియు జిల్లాలోని అండర్‌బ్యాంకింగ్ ప్రాంతాలలో బ్యాంకింగ్ యాక్సెస్‌ను మెరుగుపరచడం పట్ల మేము సంతోషిస్తున్నాము అని తెలిపారు .
'బ్యాంక్ ఆన్ వీల్స్' వ్యాన్ మా బ్యాంక్ సిబ్బందిచే నిర్వహించబడుతుంది మరియు నగదు డిపాజిట్ మెషిన్ మరియు ATM సేవలు మరియు గ్రామీణ బ్యాంకింగ్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన వ్యాను ద్వారా బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది .
HDFC బ్యాంక్ ఆన్ వీల్స్‌లో సౌకర్యాలు/సేవలు :
సాధారణ బ్యాంకింగ్ సేవలు
సేవింగ్స్ ఖాతా తెరవడం /ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకోవడం
రైతుల ఖాతా నగదు డిపాజిట్
కరెంట్ అకౌంట్ చెక్ డిపాజిట్
బ్యాంక్ ఖాతాతో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా ఆధార్‌ను లింక్ చేయడం
కిసాన్ గోల్డ్ కార్డ్ ఖాతా
గోల్డ్ లోన్ బ్యాంకింగ్ సేవలు
ట్రాక్టర్ లోన్ మొబైల్ బ్యాంకింగ్
UPIతో కార్ లోన్ డిజిటల్ బ్యాంకింగ్
ద్విచక్ర వాహన రుణం
GOI ద్వారా గృహ రుణ సామాజిక భద్రతా పథకం
దుకందర్ ఎక్స్‌ప్రెస్ ఓవర్‌డ్రాఫ్ట్ వంటి సేవలను అందించనున్నారు .
Share your comments