తెలంగాణాలో భానుడి భగభగలు మొదలైయ్యాయి ఉదయం 8 గంటలకె కొన్ని ప్రాంతాలలో 35 డిగ్రీలు దాటిపోతుంది ఉష్ణోగ్రత గత సంవత్సరం తో పోలిస్తే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది హైదరాబాద్ నగరం పరిధిలో ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగానే వున్నా తెలంగాణాలో మిగిలిన రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి .
గత సంవత్సరం ఇదే సమయంతో పోల్చితే ఈ సంవత్సరం ఎండలు తీవ్రంగా ఉన్నాయనే చెప్పాలి. బుధవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 41.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 22.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.
రెండు లక్షలు పలికిన ఆవు ధర .. పూటకు ఎన్ని లీటర్లు పాలు ఇస్తుందో తెలుసా ?
ఈవారం గురువారం, శుక్రవారాల్లో పలుప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ నుంచి 43 డిగ్రీల సెల్సియస్ మధ్యన ఉండే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావొద్దని ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేస్తోంది. వయస్సు పైబడివారు పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎండ తీవ్రంగా ఉండే సమయాల్లో పూర్తిగా ఇళ్లలోనే ఉండాలని, వడ దెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శరీరానికి చలువ చేసే పానీయాలు తీసుకోవాలని , అవసరమైనన్ని నీళ్లు తాగాలని శరీరం ఎప్పుడు హైడ్రేటెడ్ గ వుండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు .
Share your comments