News

Heavy Rain Alert! భారీ వర్ష సూచనా ! వచ్చే 24 గంటల్లో "ఆసాని" తుఫాను తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం!

Srikanth B
Srikanth B

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మార్చి 21 నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఈరోజు ప్రకటించింది.

భారత వాతావరణ శాఖ ప్రకారం, వచ్చే 24 గంటల్లో తుఫాను తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని . వాతావరణ ఏజెన్సీ ఈరోజు ఒక ట్వీట్‌లో ఇలా పేర్కొంది, “ఈరోజు ఉదయం 11:30 గంటలకు, ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీద అల్పపీడనం కార్ నికోబార్‌కు ఉత్తరాన 140 కిలోమీటర్ల దూరంలో 10.4°N/92.8°E దగ్గర కేంద్రీకృతమై ఉంది. మరియు పోర్ట్ బ్లెయిర్‌కు దక్షిణంగా 140 కిలోమీటర్లు దూరం లో అల్పపీడనం ఏర్పడనుంది.

రానున్న 24 గంటల్లో, తుఫాను దాదాపు ఉత్తరం వైపుగా A&N దీవుల వెంట మరియు వెలుపల కదులుతుంది, ఇది తీవ్ర అల్పపీడనంగా మారుతుంది."

ఆదివారం మధ్యాహ్నం, ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌకలు సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు  "అసని" తుఫాను గురించి ముందు వాతావరణ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మార్చి 21 నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఈరోజు ప్రకటించింది.

రెండు రోజుల క్రితం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పోర్ట్ బ్లెయిర్‌లో ఒక జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాన్ని మోహరించింది మరియు అదనపు బృందాలు సిద్ధంగా ఉన్నాయని మరియు అవసరమైతే వాటిని విమానంలో పంపిస్తామని పేర్కొంది.

అండమాన్ మరియు నికోబార్ అడ్మినిస్ట్రేషన్ జనాభాను రక్షించడానికి మరియు మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడానికి తగినంత అత్యవసర సామాగ్రి మరియు చర్యలతో సిద్ధంగా ఉందని ఇంకా, మత్స్య కారుల వేట , టూరిజం మరియు షిప్పింగ్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. మత్స్యకారులు స్వస్థలాలకు వెళ్లాలని సూచించారు. భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం, కోస్ట్ గార్డ్‌లు అప్రమత్తంగా ఉన్నాయి అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది.

అవసరమైతే సహాయం చేసేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖలు సిద్ధంగా ఉన్నాయని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.

పరిస్థితిని నిశితంగా పరిశీలించాలని మరియు అండమాన్ మరియు నికోబార్ అడ్మినిస్ట్రేషన్‌తో టచ్‌లో ఉండాలని కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు ఏజెన్సీలను కేంద్ర హోం కార్యదర్శి ఆదేశించినట్లు అధికారి తెలిపారు. IMD ప్రకారం, మార్చి 21 నాటికి బంగాళాఖాతంలో ఈ  సంవత్సరంలో మొదటి తుఫాను గ మారనున్నది .

ఈజిప్టు కు గోధుమల ఎగుమతి చేయడానికి భారతదేశం తుది చర్చలు !

Share your comments

Subscribe Magazine

More on News

More