గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవలి వర్షాలు తగ్గకుండానే తెలంగాణ వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని తెలిపింది. తెలంగాణకు చెందిన కొన్ని ప్రాంతాల్లో ఉరుముల, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
ఈ భారీ వర్షాలు నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ వర్షాలు పడటానికి ద్రోణి ప్రభావం కొనసాగుతుండడమే ఇందుకు కారణమని తెలిపారు. తాజాగా, వాతావరణశాఖ ఈ హెచ్చరికలను జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రానున్న నాలుగు రోజుల్లో తెలంగాణలో పలు పర్యాంతల్లో ఈదురుగాలులతో కూడే వడగళ్ల వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
అధికంగా తెలంగాణ ఉత్తర మరియు ఈశాన్య జిల్లాల్లో రానున్న నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ కురవనున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, పెద్దపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లాల్లో నిన్న ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఈ అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంటపొలాలకు నష్టం వాటిల్లింది. ఈ వర్షాలు ఇంకా ఇలాగె కొనసాగితే ఎంత నష్టపోవాలో అని రైతులు దిగులుచెందుతున్నారు.
ఇది కూడా చదవండి..
సీఎం భరోసా..అకాల వర్షాలతో నష్టం వాటిల్లిన రైతులకు ఎకరానికి రూ. 10 వేలు..
ద్రోణి కారణంగా రాష్ట్రంలో పగలు ఉష్ణోగ్రతలు పెరిగి, సాయంత్రం సమయంలో వడగండ్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించారు. ఈ అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోతున్నందున, పంట పొలాల నుంచి అధిక నీరును బయటకు పంపించే విధంగా కాలువలను రైతులు ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఇది కూడా చదవండి..
Share your comments