రానున్న రెండు రోజులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గ భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ సూచనలను జారీచేసింది , ప్రజలు అప్రమత్తం గ ఉండాలని బయట ప్రయాణించేటప్పుడు తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
కర్ణాటక ఉత్తర ప్రాంతంపై నుంచి శ్రీలంక వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితలద్రోణి ఏర్పడింది. రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. వీటి ప్రభావంతో శని, ఆదివారాల్లో తెలంగాణలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. గురువారం ఉదయం 8 నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకూ కొన్ని ప్రాంతాల్లో వానలు పడ్డాయి. ఫణిగిరి(సూర్యాపేట జిల్లా)లో అత్యధికంగా 12.6, గుండాల(యాదాద్రి)లో 10.2, భీమవరం(జోగులాంబ)లో 8.9, వీపనగండ్ల(వనపర్తి)లో 8.9, నాగారం(సూర్యాపేట)లో 8.2, పడమటిపల్లె(నల్గొండ)లో 6.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉష్ణోగ్రత కొన్ని ప్రాంతాల్లో సాధారణంకన్నా 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా ఉంది.
Share your comments