సోమవారం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది , ఉప్పల్ , నాచారం , ఈసిల్ , నాగారం , దమ్మాయిగూడ మరియు కీసర ప్రాంతాలలో భారీ వర్షం నమోదయింది.
మరో వైపు హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో సెప్టెంబర్ 23-25 వరకు ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
హైదరాబాద్‌లో, బుధవారం వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. మంగళవారం నగరంలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయబడింది, వాతావరణ పరిస్థితులు తీవ్రతరం అయ్యే అవకాశం ఉన్నందున పట్టన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
ఆదివారం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం కురవగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 103.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లోని గోల్కొండలో కూడా గణనీయమైన వర్షపాతం నమోదైంది, 91.3 మి.మీ- ఈ రోజు నగరంలో అత్యధికంగా నమోదైంది.
Share your comments