News

తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం..

Srikanth B
Srikanth B

ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఆ కారణంగా రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది .

తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో పనులకు వచ్చిన వారు తడిసి ముద్దవుతున్నారు. రానున్న మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది . ఎల్లుండి కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

ఉత్తర బంగాళా ఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం ఇవాళ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు వాయుగుండంగా బలపడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఇది వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోని పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ఒడిశా ప్రాంతంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. ఈ వాయుగుండం రానున్న 6గంటలలో పశ్చిమ వాయవ్య దిశగా కదిలి పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ఒడిశా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆగస్టు 21 వరకు VIP దర్శనాలు రద్దు ...

Share your comments

Subscribe Magazine

More on News

More