మండుతన్న ఎండలతో సతమతమవుతున్నా జనానికి ఆంధ్రపదేశ్ వాతావరణ కేంద్రం వర్ష సూచనలను జారీ చేసింది . రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ...కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతోపాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది .
మరోవైపు రాష్ట్రంలో రుతుపవనాల విస్తరణతో ఎండలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశము ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణ రాష్ట్రములో ఉష్ణోగ్రతలు రానున్నమూడు నాలుగు రోజులలో తగ్గుముఖం పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ దిక్కు నుంచే వీచే గాలులు తెలంగాణ మీదుగా తక్కువ ఎత్తులో వీస్తున్నాయని ప్రకటించింది. రాబోయే మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. రాష్ట్రంలో కొన్ని చోట్ల మెరుపులతో కూడిన వర్షం పడుతుందని, ఆదిలాబాద్, ఖమ్మం, ములుగు, కొమరం భీం, మంచిర్యాల, కొత్తగూడెం, సూర్యాపేట, భూపాలపల్లి జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది .
ఆధార్ కార్డుఅప్డేట్ గడువు పొడగింపు..
మరోవైపు "బైఫోరిజోయ్ " తుఫాను కారణంగా సౌరాష్ట్ర, కచ్‌లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం మరియు త్రిపురలోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయి. అదే సమయంలో, హిమాచల్ ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు మరియు బలమైన గాలులతో మంచు కురిసే అవకాశం ఉంది.
Share your comments