News

తెలంగాణలో భారీ వర్షాలతో పత్తి పంటకు తీవ్ర నష్టం.. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులు..

Srikanth B
Srikanth B

తెలంగాణలో భారీ వర్షాలతో పత్తి పంటకు తీవ్ర నష్టం.. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న రైతులు ప్రకృతి విపత్తులు, అకాల వర్షాలు మిగిల్చే నష్టం అంతా ఇంతా కాదు..ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు ఈ వర్షాల వల్ల భారీ నష్టం వాటిల్లుతోంది. అప్పులు చేసి, పెట్టుబడులు పెట్టి, పంట చేతికందక ఎదురు చూస్తున్న రైతుల ఆశలపై వర్షం నీళ్లు చల్లుతోంది. ప్రభుత్వ సాయం కోసం రైతుల ఎదురుచూపులు తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కరీంనగర్‌లోని పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు.

దాదాపు రెండు లక్షల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. దీంతో వ్యవసాయ పెట్టుబడులకు తాము చేసిన అప్పులు ఎలా తీర్చాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.

నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముఖ్యంగా కరీంగనర్ జిల్లాలో పత్తి పంటకు అపార నష్టం కలిగింది. వరికి బదులు పత్యామ్నయ పంటలపై దృష్టిసారించాలంటూ ప్రభుత్వం చెప్పడంతో ఈసారి వరికి బదులు.. చాలా మంది రైతులు అధికంగా పత్తిని సాగు చేశారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు రైతులు. గతేడాది తెల్లబంగారానికి మంచి డిమాండ్ ఉండడంతో ఈసారి ఎక్కువ శాతం సాగుచేశారు.

భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల వ్యవసాయం నీటమునిగింది. కొన్నిచోట్ల పురుగులు పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రూ. ఎకరాకు 40 వేల పెట్టుబడి పెట్టినా అసలు లాభం లేదని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, వర్షంతో పంట నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలని, వారికి పారితోషికం అందించాలని రైతులు కోరుతున్నారు.

స్మార్ట్ వ్యవసాయం దిశగా భారతదేశం అడుగులు

Share your comments

Subscribe Magazine

More on News

More