తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి . ఇదే క్రమంలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ , మరికొన్ని జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్ ను జారీ చేసింది .
తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు గాలి వేగం గంటకు 30-40 కి.మీ.తోభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు గాలి వేగం గంటకు 30-40 కి.మీ.తో
తెలంగాణ రాష్ట్రంలో తేలిక పాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి మవనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచనలు జారీ చేసింది.
గుడ్ న్యూస్: ప్రభుత్వం రిటైల్ టొమాటో ధరలను కిలోకు రూ.70కి తగ్గుదల..
మరియు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసేఅవకాశం ఉందని ఈ జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్ ను జారీ చేసింది .
Share your comments