రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది , వాతవరణ శాఖ హెచ్చరించినట్టుగానే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉరుములు , పిడుగులతో కూడిన వర్షాలు నమోదయ్యాయి రెండు తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడా ప్రాణ నష్టం కూడా జరిగింది , మరోవైపు అకాల వర్షాలతో పంటలకు భారీ నష్టం సంభవించింది , రానున్న 3 రోజుల పటు కూడా రెండు తెలుగు రాష్ట్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది .
ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి, దక్షిణ తమిళనాడు నుంచి మధ్య, అంతర్గత కర్ణాటక, గోవా మీదుగా ఉత్తర కొంకణ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది .
PM కిసాన్: ఆన్‌లైన్‌లో తప్పులను సవరించుకోండి ఇలా!
ఈరోజు తెలంగాణ వ్యాప్తంగ అన్ని జిల్లాల్లో యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్,జామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట జిల్లలో ఉరుములు మెరుపులు తో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది .
మార్చి 20 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ(TSDPS) కూడా హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉష్ణోగ్రతలు 27 డిగ్రీ సెల్సియస్ కు తగ్గనున్నాయి.
Share your comments