తెలంగాణ రాష్ట్రంలో ఇవాల తేలికపాటి వర్షాలు నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కోత సమయం కావడంతో రైతులు తీవ్ర ఆందోళకు గురువవుతున్నారు. అకాల వర్షాలు, వడగళ్ల వానలకు పంటలు దెబ్బతినడంతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన రైతులను వరి పంట చేతికందే సమయంలో వడగళ్ల వాన భయం వెంటాడుతోంది.
రాష్ట్రంలో అక్కడక్కడ ఇవాళ, రేపు ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుండి 40 కి మీ వేగంతో గాలితో పాటు వడగళ్ల వాన కూడా రాష్ట్రంలో కొరికే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు తెలంగాణలో రానున్న 24 గంటల్లో మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ జిల్లాలో వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది.
ఇది కూడా చదవండి..
SBI రిక్రూట్‌మెంట్ 2023: జీతం గరిష్టంగా రూ. 41,000; ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి!
మిగిలిన జిల్లాలో యెల్లో హెచ్చరికను వాతావరణ శాఖ జారీ చేసింది. ఛత్తీస్ గఢ్ లోని మధ్య భాగాల నుండి విదర్భ, తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టంకి 0.9 కి మి ఎత్తు వద్ద కొనసాగుతూ ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నుండి మోస్తరు వర్షాలు పడ్డాయి. రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం జనగాం జిల్లా కొడకండ్లలో24.2మి.మి వర్షం కురిసింది. మిగిలిన చోట్ల గంగధరలో 22.6, యాదగిరిగుట్టలో 19.4, చందురులో 9.6, జాజిరెడ్డిగూడెంలో 8.6, తిరుమలగిరిలో 8, మాల్యాల్‌లో 2.6 మి.మి వర్షపాతం నమోదయింది.
ఇది కూడా చదవండి..
Share your comments