News

తెలంగాణ వ్యాప్తంగా నేడు, రేపు భారీ వర్షాలు .. ఎల్లో అలర్ట్ జారీ!

Srikanth B
Srikanth B
Heavy rains today and tomorrow across Telangana
Heavy rains today and tomorrow across Telangana


తెలంగాణ వ్యాప్తంగా నేడు, రేపు భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి . ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, దక్షిణ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారత వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, ఖమ్మం మండలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..ఇవాళ్టి నుంచి మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 26, 27 తేదీల్లో మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.

ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన..ఎంసెట్ అగ్రికల్చర్ రీషెడ్యూల్ ఇదే..!


భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. వర్షాల కారణంగా ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వరదలపై ప్రగతి భవన్‌లో శనివారం (జూలై 23) కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చేయాలని సూచించారు. గోదావరి నది మరింత ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉండటంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

అటల్ పెన్షన్ యోజన ఏమిటి ? ఎవరు అర్హులు ..

Share your comments

Subscribe Magazine

More on News

More