మనిషి మనుగడకు, అతిముఖ్యమైనవి ఆహారం మరియు నీరు. ఈ రెండిట్లో ఏది తక్కువైనా మనిషి విలవిలలాడక తప్పదు. ఐతే ఇప్పుడు బెంగుళురు వాసులు తీవ్ర నీటి సమస్యలను ఎదురుకుంటున్నారు. వేసవి కాలంలో నీటి కొరత ఏర్పడటం సహజమే. కానీ వేసవి మొదట్లోనే బెంగుళూరు ప్రజలు తీవ్ర నీటి కొరతతో భాదపడుతున్నారు. ప్రభుత్వం పటించుకోక, సోషల్ మీడియా వేదికగా తమ భాదలను వెళ్లబోసుకుంటున్నారు.
అపార్టుమెంట్లు మరియు గేటెడ్ కమ్యూనిటీ లోని జనం సైతం నీరు దొరక్క అష్టకష్టాలు పడుతున్నారు. నిత్యావసరాలు, కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీరు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఇదే అదునుగా చేసుకున్న, వాటర్ ట్యాంకర్ యజమాన్లు రేట్లను అమాంతం పెంచేశారు. వాటర్ ట్యాంకర్ అందుబాటులోకి రావడమే గగనమైపోతుందని బెంగుళూరు ప్రజలు వాపోతున్నారు.
నగరాల్లోని ప్రజల పరిస్థితే ఇలాఉంటే, గ్రామాల్లోని వారి జీవితం మరింత, దుర్బలంగా మారింది. వ్యవసాయానికి మరియు పశువులకు అవసరం అయ్యే నీటిని అందించలేక రైతులు తీవ్ర యాతన పడుతున్నారు. నీరు లేక మూగజీవులు విలవిలలాడుతున్నాయి. సాగు నీరులేక, పొలాలు ఎండిపోతున్నాయి. ఇది పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది.
మరోవైపు పట్టణాల్లోని ప్రజలు తమ నీటి అవసరాలకోసం మాల్స్ కు పరుగులుపెడుతున్నారు. ఇంకొంత మంది ఏకంగా, స్నానానికి సోప్ మరియు టవల్తో జిమ్ములకు వెళ్తున్నారు. ఉరుకులు పరుగులతో కూడిన ఉద్యోగాలు ఒకవైపు, కన్నీళ్లు పెట్టిస్తున్న నీటి సమస్యలు మరోవైపు. ఇప్పటికైనా ప్రభుత్వం ద్రుష్టి సారించి, బెంగుళూరు వాసులను నీటి కష్టాలు నుండి విముక్తులను చెయ్యాలి. ఇటువంటి సమస్యలు తలెత్తకుండా, నీటి వృథాను తగ్గించే దిశగా పని చెయ్యాలి.
Share your comments