ఈ మధ్య కాలంలో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో
బాగా ప్రాచుర్యం పొందిన మిద్దె తోటల పెంపకం (టెర్రస్ కిచెన్ గార్డెనింగ్) లో ఇంటి అవసరాలకు సరిపడా సేంద్రియ పద్ధతుల్లో వివిధ రకాల కూరగాయలను సాకు చేయడానికి పట్టణ ప్రజలు ఆసక్తి చూపిస్తూ అర్బన్ కిసాన్ గా మారుతున్నారు. ఈ నేపథ్యంలో మిద్దె తోటల పెంపకంలో అధిక ఫలసాయం పొందడానికి కుండీల్లో మట్టిని కాకుండా అధిక పోషకాలతో కూడిన అర్క ఫర్మెంటెడ్ కోకోపీట్- ఎ.ఎఫ్.సి.
(సేంద్రియ కొబ్బరి పొట్టు) అందుబాటులో ఉంది. అయితే దీనిని ఏవిధంగా తయారు చేస్తారు. ఎక్కడ లభిస్తారు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
మిద్దె తోటల పెంపకం ఆవశ్యకత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్‌ఆర్) వారు రూపొందించిన అర్క ఫర్మెంటెడ్ కోకోపీట్ ను మొదట శుద్ధిచేసిన కొబ్బరిపొట్టును సేకరించి అందులో మొక్కల ఎదుగుదలకు అవసరమైన మరియు మొక్కల వ్యాధి కారకాలను నియంత్రించే మైక్రోబియల్ కన్సార్షియం ద్రావణంలో కొన్ని రోజుల పాటు పులియబెడితే అధిక పోషకాలతో కూడిన అర్క ఫర్మెంటెడ్ కోకోపీట్
(సేంద్రియ కొబ్బరి పొట్టు) తయారవుతుంది.
సేంద్రియ కొబ్బరి పొట్టు తయారు చేసుకునే విధానం మరియు సేంద్రియ కొబ్బరి పొట్టును ఉపయోగించి మట్టి వాడకుండా కుండీల్లో వివిధ రకాల మొక్కలను సాగు చేసుకోవటంపై ఆగస్టు 13న ఐఐహెచ్‌ఆర్ శాస్త్రవేత్తలు శిక్షణ ఇవ్వనున్నారు.ఆసక్తి గల వారెవరైనా శిక్షణకు
అర్హులే. అభ్యర్థులు ఈ కింది ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకొని మరింత సమాచారం తెలుసుకోవచ్చు.
https://forms.gle/tBYyusdJ9D2hgvQD6
Share your comments