పెరుగుతున్న ఎండలతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు, రెండు తెలుగు రాష్ట్రాలలో ఇదే పరిస్థితి ఉన్న తెలంగాణ లో ఇంకో మెట్టు పైనుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉక్కపోతను అధిగమించడానికి చేసే ప్రత్యామ్నాయాలతో, విద్యుత్ వినియోగం కూడా తార స్థాయి కి చేరుకుంటుంది.
హైదరాబాద్ వాతావరణం కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం హైదరాబాద్లోని బోరబండ లో అత్యధికంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నామోదైనది. అలానే ఖైరతాబాద్ లో 40. 1 డిగ్రీలు , శేరిలింగంపల్లి లో 39. డిగ్రీలు , షేక్ పేట లో 38. 9 డిగ్రీలు , మియాపూర్ లో 38. 7, సరూర్నగర్ లో 38. 1 , కాప్రాలో 38 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు తెలుస్తుంది . పగటి పూటే కాక రాత్రి కూడా ఉష్ణోగ్రతలు అధికం గానే నమోదవుతున్నాయి. ఆశ్చర్యంగా మంగళవారం రాత్రి 25 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయింది. ఉక్కపోతని అధిగమించే క్రమం లో ఈ నెల 3వ తేదీన గరిష్టంగా 69. 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం పెరిగిపోయింది.
ఇది కూడా చదవండి ..
ఏప్రిల్ 1 నుండి అత్యధిక వడ్డీ రేట్లు ఇచ్చే పోస్ట్ ఆఫీస్ స్కీమ్ !!
ఇదిలా ఉండగా రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తల సమాచారం ప్రకారం వచ్చే ఐదు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి . నైరుతి గాలులు 8 కిలోమీటర్ల వేగం తో వీచడం వలన వడగాల్పులు వచ్చే అవకాశం ఉంది. కావున వృద్దులు, మహిళలు, చిన్నపిల్లలు, బయటకి వచ్చినప్పుడు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా హెచ్చరించారు .
ఇది కూడా చదవండి ..
ఏప్రిల్ 1 నుండి అత్యధిక వడ్డీ రేట్లు ఇచ్చే పోస్ట్ ఆఫీస్ స్కీమ్ !!
Share your comments