నెమలి భారతదేశ జాతీయ పక్షి అని, జన గణ మన జాతీయ గీతం అని, అలాగే భారత జాతీయ క్రీడ ఏంటని ప్రశ్నిస్తే అందరు హాకీ అని చెబుతారు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారత దేశానికి అధికారకంగా ఎలాంటి జాతీయ క్రీడా లేదు.
భారత దేశంలో హాకీని దేశ జాతీయ క్రీడ అని నమ్ముతున్న వారే ఎక్కువ. కానీ నిజానికి మనకి ఎలాంటి జాతీయ క్రీడా లేదు. ఈ విషయాన్నీ దేశ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
దేశం లో ఎవరిని అడిగిన జాతీయ గీతం జనగణమన అని జాతీయ పక్షి నెమలి అని అలాగే జాతీయ క్రీడా హాకీ చెబుతారు. దీనికి ముఖ్య కారణం చిన్నప్పుడు మనకి చెప్పబడిన పాఠాలే. హాకీ మన జాతీయ క్రీడ కాదు అని వినడానికి కొంచెం కటువుగా ఉన్న ఇది వాస్తవం.
హాకీ మన జాతీయ క్రీడా అనుకోవడానికి కారణాలు
ఒలింపిక్స్ చరిత్రలో అత్యధిక స్వర్ణాలు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది.
1928లో అరంగేట్రం చేసిన ఒలింపిక్స్‌లో భారత్ 10 బ్యాక్ టు బ్యాక్ స్వర్ణాలను గెలుచుకుంది.
1948 ఒలింపిక్స్, లండన్
ఇది స్వాతంత్రం తర్వాత భారతదేశం యొక్క మొదటి ఆట. భారతదేశం ఫైనల్‌లో మొదటిసారి గ్రేట్ బ్రిటన్‌తో తలపడి, 4-0తో మ్యాచ్‌ను గెలిచింది.
ప్రపంచ స్థాయిలో భారత దేశం హాకీ క్రీడలో పై చేయిని సాధించింది కావున హాకీ ఖచ్చింతంగా మన దేశ జాతీయ క్రీడ అనుకుంటున్నాం
సమాచార హక్కు చట్టం ప్రకారం మన భారత దేశానికి అధికారకంగా ఎలాంటి జాతీయ క్రీడా లేదు.
జాతీయ బాష:
మన జాతీయ బాష ఏంటని అని అడిగితే ఎక్కువ శాతం ప్రజలు హిందీ అని జవాబు ఇస్తారు,ఇప్పుడిప్పుడే మనకి అధికారకంగా ఎలాంటి జాతీయ బాష లేదు అని ప్రజలు గమనిషున్నారు కానీ భారత దేశం లో ఎక్కువ సంఖ్యలో మాట్లాడుతున్న భాషగా హిందీ ప్రసిద్ధి చెందిది. ఇటీవల కాలం లో జాతీయ బాష గురించి జరుగుతున్న గంధర గోళం గురించి తెలిసినదే, హిందీని జాతీయ భాషగా అంగీకరించడానికి దక్షిణ భారతీయులు ససేమీరా అంటున్నారు. ఈ నేపథ్యం లో కొందరు సంస్కృతం ని జాతీయ భాషగా పరిగణించాలని ప్రతిపాదనలు తెలుపుతున్నారు.
మరిన్ని చదవండి.
Share your comments