గ్రామాల్లో ఏళ్లతరబడి అనేక వివాదాలకు కారణం అవుతున్న భూ వివాదాలకు,పొలం గట్ల సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం "వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం"ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని 17వేల రెవెన్యూ గ్రామాల్లో 3.32 కోట్ల ఎకరాల భూమిని పూర్తిగా రీసర్వే చేసి ప్రతి సర్వే నంబరుకు పక్కాగా సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా భూముల రీ సర్వే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా త్వరితగతిన పూర్తిచేయడానికి అవసరమైన 1,294 మంది సిబ్బందికి ఈ నెల 26వ తేదీ నుంచి విడతల వారీగా శిక్షణ ఇవ్వనున్నట్టు సర్వే సెటిల్‌మెంట్, భూ రికార్డుల కమిషనర్ సిద్ధార్థజైన్ మాట్లాడుతూ సహాయ విభాగ అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు, రెవెన్యూ సహాయకులకు 15 రోజులపాటు శిక్షణ ఇస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. సామర్లకోటలోని సర్వే ట్రైనింగ్ అకాడమీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.
ప్రస్తుతం కరోనా కారణంగా అందరికీ ఒకేసారి శిక్షణ ఇచ్చే అవకాశం లేకపోవడం వల్ల జిల్లా స్థాయిలో ప్రతి బ్యాచ్‌కు 60 మందిని ఎంపిక చేసి విడతల వారీగా శిక్షణ ఇప్పిస్తున్నట్టు తెలిపారు.శిక్షణ ముగింపులో ప్రతి బ్యాచ్‌కు సర్వే నిర్వహణ పరీక్ష మాదిరిగానే థియరీ, ప్లాటింగ్‌పై తుది పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తామన్నారు ఈ శిక్షణ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి జాయింట్ కలెక్టర్ల ద్వారా రెవెన్యూయేతర విభాగం నుంచి పరిశీలకులను నియమిస్తామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన భూముల రీ సర్వే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి
భూముల పునర్వ్యస్థీకరణకార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని సంప్రదాయక సర్వేతో పాటు సిలబస్‌లో ఈటీఎస్, డీజీపీఎస్, నెట్‌వర్క్, ఎస్‌ఓపీ, గ్రౌండ్ ట్రూతింగ్, ఫీచర్ ఎక్స్‌ట్రాక్షన్, గ్రౌండ్ ధ్రువీకరణ వంటి అధునాతన అంశాలను సిలబస్‌లో చేర్చడం జరిగింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా రైతులపై ఒక రూపాయి భారం పడకుండా సర్వే నంబర్లవారీగా నాటే నంబరు రాళ్ల మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే స్పష్టం చేశారు.
Share your comments