మనకు ఇప్పటివరకు తేనె ను తేనెటీగలు మాత్రమే తాయారు చేస్తాయని తెలుసు , ఈతరం పిల్లలకైతే తేనె అంటేనే షాపులో దొరికే ఒక వస్తువుగా మాత్రమే తెలుసు అయితే మనం ఇక్కడ తేనెటీగలకు భిన్నముగా చీమలుకూడా తేనెను తయారుచేస్తున్నాయి.
అయితే ఇవి మన దేశం చీమలు మాత్రం కావు ఆస్ట్రేలియాలోఉండే హనీ పాట్ అని పిలువబడే ఈ చీమలు ఎడారి ప్రాంతంలో లో ఉండే ఒక చీమ జాతి , ఎడారిలో సాధనముగానే ఏ జంతువులకైన ఆహారకొరత వుంటుంది , అయితే దీనిని అధిగమించడానికి అక్కడి చీమలు వాటి పొట్టలోనే తేనెను దాచుకుంటాయి. హనీ పాట్ చీమలు చూడ్డానికి మామూలు చీమల్లాగానే ఉంటాయి. కానీ, వీటికి పొట్ట ఉబ్బి ఉంటుంది. అందులోనే అవి తేనె దాచుకుంటాయి. ఈ పొట్ట అరంగుళం సైజులో పెరుగుతుంది. తేనెటీగల్లాగానే ఇవి కూడా పూల నుంచి మకరందాన్ని సేకరించి వాటిని తేనెగా మారుస్తాయి. చీమలు పెరిగే కొద్దీ వాటి పొట్టలో తేనె కూడా పెరుగుతుంది.
అధిక దిగుబడి ఇచ్చే 61 కొత్త విత్తన రకాలను అభివృద్ధి చేసిన PJTSAU
మోయలేనంత తేనె పొట్టలో నిండగానే అవి వాటి పుట్టలలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటాయి . పుట్టలో ఉన్నంత కాలం సేకరించిన తేనెను తాగుతూ అక్కడే ఉండిపోతాయి , మరియు పుట్టలో ఉంటే ఇతర చీమలకు కూడా ఇవి ఆహారంగా తేనెను అందిస్తాయి , ఎడారిలో ఆహారం దొరకనంత కాలం ఏవిధముగానే జీవనం సాగిస్తాయి . ఆస్ట్రేలియా, మెక్సికో, ఆఫ్రికాలోని ఎడారుల్లో ఈ చీమలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటి గురించి తెలిసినవాళ్లు అవి కనిపించగానే వాటిని పట్టుకుని నోట్లో వేసుకుంటారు. చీమల తేనె పలుచగా ఉంటుంది. ఇందులో ఫ్రక్టోజ్ కంటే గ్లూకోజ్ ఎక్కువ. తేనెటీగల తేనెలో ఫ్రక్టోజ్ ఎక్కువ. అయితే ఈ రెండు తేనెల్లో యాంటీ ఆక్సిడెంట్స్ మాత్రం ఎక్కువే.
ఏది ఏమైనప్పటికి భూమిమీద జీవనం సాగించడం ఒక్కో ప్రాణిది ఒక్కో మార్గం ,ఒక్కో ప్రాణికి ఒక్కో వెసులుబాటు తో జీవనం కొనసాగిస్తున్నాయి .
Share your comments