News

వాట్సప్‌ ద్వారా క్షణాల్లో వ్యాక్సిన్ సర్టిఫికేట్.. ఈజీగా డౌన్‌లౌడ్ చేసుకోండిలా..?

KJ Staff
KJ Staff
corona vaccination
corona vaccination

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరుగుతోంది. గతంలో వ్యాక్సిన్ పై అనేక తప్పుడు ప్రచారం జరగడంతో.. వ్యాక్సిన్ వేయించుకునేందుకు చాలామంది వెనకడుగు వేశారు. కానీ సెకండ్ వేవ్ తో ప్రజల్లో భయం మొదలై వ్యాక్సిన్ పై భయం తొలగిపోవడంతో.. వ్యాక్సిన్ వేయించుకునేందుకు క్యూలు కడుతున్నారు. ఇండియాలో ఇప్పటివరకు 50.7 కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకోగా.. ఇందులో 11.2 కోట్ల మంది రెండు డోస్ లు వేయించుకున్నారు. 8.2 శాతం మంది రెండు డోస్ లు వేయించుకున్నారు.

అయితే విదేశాలకు వెళ్లాలంటే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరి. అందుకే వ్యాక్సిన్ వేయించుకున్న ప్రతిఒక్కరికీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ జారీ చేస్తుంది. వ్యాక్సిన్ వేయించుకున్న గంటలోగా ఫోన్ కు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ద్వారా వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే కోవిన్ వెబ్ సైట్ లోకి వెళ్లి ఆధార్ నెంబర్ ద్వారా వ్యాక్సిన్ సర్టిఫికేట్ పొందవచ్చు. అయితే కొన్నిసార్లు కొవిన్ పోర్టర్ స్లోగా ఉంటుంది. వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్ లోడ్ చేసుకోవాలంటే రావడం లేదు.

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ సర్టిఫికేట్ కు సంబంధించి మరో సదుపాయం కల్పించింది. వాట్సాప్ ద్వారా వ్యాక్సిన్ సర్టిఫికేట్ ను డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది. దీని వల్ల క్షణాల్లో సులువుగా వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా వ్యాక్సిన్ సర్టిఫికేట్ ను సులువుగా ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

-‘MyGov Corona Helpdesk’ వాట్సాప్‌ నెంబర్‌ 9013151515ను సెవ్ చేసుకోండి.
-ఆ తర్వాత కోవిడ్ సర్టిఫికేట్ అని మెసేజ్ పెట్టండి
-ఆ తర్వాత మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి

-ఆ తర్వాత మీ పేరు వస్తుంది. మీ పేరును సెలక్ట్ చేసుకోండి

-అప్పుడు మీ సర్టిఫికేట్ వస్తుంది
-దానికి డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుంది.

Share your comments

Subscribe Magazine

More on News

More