దేశంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇక అందులో వ్యవసాయానికి సంబంధించిన విశ్వవిద్యాలయం కోయంబత్తూర్ లో ఉంది. దక్షిణాదిలో ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం మొట్టమొదటిది స్థానంలో ఉంది. ఇక ఈ విద్యాసంస్థలో 50 ఏళ్ల క్రితం నుండి రైతులకు సేంద్రియ వ్యవసాయ విధానాన్ని గురించి నేర్పిస్తున్నారు. ఇందులో ఎంతో మంది చేరి వ్యవసాయ విధానాన్ని గురించి నేర్చుకున్నారు. ఇక అందులో ఓ 104 ఏళ్ల పాపమ్మాళ్ అనే వృద్ధురాలు కూడా 50 ఏళ్ల క్రితమే ఆ విశ్వవిద్యాలయంలో సేంద్రీయ వ్యవసాయం గురించి నేర్చుకుందట.
దాంతో ఆమె ఎంతో కష్టపడి మంచి లాభాన్ని అందుకోవడమే కాకుండా ఆమెకు పద్మశ్రీ అవార్డు కూడా అందిందట. ఇక ఆమె సేంద్రియ విధానం గురించి తెలుసుకోక ముందు రసాయన ఎరువులతో, పురుగుల మందులతో సేద్యం చేసిందట. ఇక ఆ తర్వాత సేంద్రియ విధానం గురించి తెలుసుకున్నాక ఇన్నాళ్లు ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసే రసాయన ఎరువులతో ఇలా చేశానా అని బాధపడిందట. ఆమె ఎక్కువగా దేశవాళి విత్తనాలను ఎంచుకునేదట. ఇక ఆమె ఆవు పేడ, మూత్రం, గడ్డి, బెల్లం వంటి మిశ్రమాలను సేంద్రియ పదార్థంగా వాడుతానని తెలిపింది.
ఆవు పేడ, లవంగాలు, ఉప్పును ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి పొలంలోని భూమిలో పాతి పెట్టి 15 రోజులకు ఒకసారి మూత తీసి ఆ మిశ్రమాన్ని కలియబెట్టేదట. ఇక ఆ మిశ్రమాన్ని రెండు నెలల తర్వాత బయటకు తీసి మొక్కల్లో పాదుల్లో చల్లేదట. వేపాకును ఎండబెట్టి ఆ తర్వాత పొడిచేసి అందులో వెల్లుల్లి పొడిని మరియు నీటిని ద్రావణంలో తయారుచేసుకొని పంటపై చల్లడం వల్ల పురుగులు వంటివి పంటపై చేరకుండా ఉంటాయని తెలిపింది. మొత్తానికి వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున ఎంతోమందికి వ్యవసాయం పట్ల అవగాహన, సేంద్రియ పదార్థాల వాడుక విధానం గురించి మంచి అనుభవం కలిగిందని తెలుస్తుంది.
Share your comments