రైతులను వ్యాపారులుగా తీర్దిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే PM Kisan FPO(పీఎం కిసాన్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ స్కీమ్ యోజన). రైతులు అగ్రికల్చర్ బిజినెస్ మొదలుపెట్టాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద రూ.15 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది.
ఈ పథకంలో రైతులు ఎలా చేరాలి?
ఒక్క రైతుకు ఈ ఆర్థిక సాయం రాదు. 11 మంది రైతులు కలిసి ఒక కూటమిగా ఏర్పాటు కావాలి. ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవాలి. కంపెనీ చట్టం కింద ఆ సంస్థ పేరును రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం ద్వారా వచ్చే డబ్బుల ద్వారా విత్తనాలు, మందులు, ఎరువులు, ఇతర పరికరాలను రైతులు విక్రయించుకోవచ్చు.
రిజిస్ట్రేషన్లు ఎప్పుడు?
ఈ పథకానికి ఇంకా రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాలేదు. త్వరలో దీనికి రిజిస్ట్రేషన్లను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. దీని కోసం 2023-24 నాటికి 10 వేల ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. మరికొద్ది నెలల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
సాయం ఎలా?
10 వేల ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలనే లక్ష్యం ప్రభుత్వం పెట్టుకుంది. ఐదేళ్లపాటు వీటికి సాయం ఇస్తుంది. ఒక్కో ఎఫ్ పీవోకు రూ.15 లక్షలు ఇస్తుంది. దీని ద్వారా ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేసుకుని పనులు ప్రారంభించుకోవచ్చు.
Share your comments