రైతుల కోసం ఏపీ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలు, రైతు బీమా, పంట బీమా లాంటి అనేక పథకాలతో పాటు వైఎస్సార్ జలకళ అనే పథకాన్ని కూడా అమలు చేస్తోంది. అసలు వైఎస్సార్ జలకళ పథకం ఏంటీ?.. దాని వల్ల రైతులకు ఉపయెగం ఏంటి?..ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం?
వైఎస్సార్ జలకళ ఎందుకు?
రైతులకు ఉచితంగా బోర్లు వేయించడం, పంపుసెట్లు, విద్యుత్ కనెక్షన్లు అందించడమే ఈ పథకం ఉద్దేశం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఈ పథకం ద్వారా కొంతమంది రైతులు లబ్ధి పొందారు.
ఈ పథకానికి ఎవరు అర్హులు?
ఐదు ఎకరాలలోపు పోలం ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. గతంలో ఐదు ఎకరాలలోపు పొలం ఉన్న రైతులందరికీ ఈ పథకం వర్తిస్తుందని ప్రకటించిన ప్రభుత్వం.. ఆ తర్వాత రూల్‌ని మార్చింది. కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
గ్రామ వాలంటీర్లు ద్వారా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇక ఆన్‌లైన్‌లోనూ దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
-పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డు
Share your comments