News

మొబైల్ నుంచి పీఎం కిసాన్‌కి అప్లై చేసుకోవడం ఎలా?

KJ Staff
KJ Staff
Pm Kisan
Pm Kisan

ఒకప్పుడు ఏదైనా ప్రభుత్వ పథకం రావాలంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రోజులు తరబడి తిరగాల్సి వచ్చేది. రోజులు తరబడి తిరిగినా.. ప్రభుత్వ పథకాలు వస్తాయనే గ్యారెంటీ లేదు. ప్రభుత్వ అధికారులకు ఎంతో కొంత లంచం ఇవ్వాలి. లంచం ఇచ్చినా సరే.. ఆ  పత్రాలు కావాలి.. ఈ పత్రాలు కావాలి అంటూ తిప్పుతూ ఉంటారు. అలాగే లంచంతో పాటు రికమండేషన్లు ఉంటేనే ప్రభుత్వ పథకాలు అందేవి.

కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడంతో.. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ప్రపంచం మొత్తం మన చేతుల్లోకి వచ్చేసింది. ఏది కావాలన్నా సరే.. మన చేతుల్లో ఉన్న సెల్‌ఫోన్‌తో చిటికెలో జరిగిపోతోంది. ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ రోజులు తరబడి తిరగాల్సిన అవసరం లేదు. లంచం, రికమండేషన్లు అవసరం లేదు.

ఆన్‌లైన్ ద్వారా మన చేతిలో ఉండే సెల్‌ఫోన్‌తో ఏ ప్రభుత్వ పథకానికి అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వాలు కూడా టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రజలకు నేరుగా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నాయి.

అందులో భాగంగా రైతుల కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అది కూడా ఒక యాప్‌తో దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించింది.  PMKISAN GoI అనే యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

-గూగుల్ ప్లే స్టోర్ నుంచి  PMKISAN GoI అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి

-తర్వాత అందులో కనిపించే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి

-అనంతరం మీ ఆధార్ కార్డు డీటైల్స్, పోలం పాస్‌బుక్ డీటైల్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇచ్చి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి.

-మీ దరఖాస్తు స్టేటస్‌ను తెలుసుకోవాలంటే స్టేటస్ ఆఫ్ సెల్ప్ రిజిస్టర్డ్ ఫార్మర్ బటన్ మీద క్లిక్ చేయాలి

Share your comments

Subscribe Magazine

More on News

More