ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఆర్థిక చేయత అందించేందుకు వైఎస్సార్ చేయూత అనే పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా 45 నుంచి 60 సంవత్సరాలు మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు సంవత్సరానికి రూ.18,750 ఆర్థిక సాయం చేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం రెండో విడత డబ్బులను సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్‌లో బటన్ నోక్కి విడుదల చేశారు. 23.44 లక్షల మందికి రూ.4,395 జమ చేశారు. వీటిని నేరుగా మహిళ బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు.
వైఎస్సార్ చేయూత డబ్బులు వచ్చాయా.. లేదా తెలుసుకోండిలా
-వైఎస్సార్ నవశకం వెబ్ సైట్‌కి వెళ్లండి
-అక్కడ కేటగిరిలో వైఎస్సార్ చేయూత స్కీమ్ ను ఎంచుకోండి
-ఆ తర్వాత వైఎస్సార్ చేయూత ఎలిజిబుల్, ఇన్ ఎలిజిబుల్ బటన్ మీద క్లిక్ చేయండి
-మీ జిల్లా, మండలం, గ్రామం ఎంచుకుని సబ్మిట్ ఎంచుకోండి
-ఒక లిస్ట్ వస్తుంది, అందులో మీ పేరు , పేమెంట్ డీటైల్స్ తెలుసుకోవచ్చు
ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి?
ఆన్ లైన్ లో అప్లై చేసుకునే అవకాశం లేదు. ఆఫ్ లైన్ ద్వారా గ్రామ సచివాలయాల ద్వారా లేదా గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా అప్లై చేసుకోవచ్చు.
డబ్బులు పడకపోతే ఏం చేయాలి?
-అర్హత ఉండి డబ్బులు పడకపోతే వాలంటీర్లను లేదా గ్రామ సచివాలయంలో సంప్రదించాలి.
-క్యాస్ట్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
-1902 నెంబర్ కు కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు
Share your comments