రైతులకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. రైతు బీమా, పంటల బీమాతో పాటు అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. అందులో అత్యంత ముఖ్యమైన పథఖం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. దీనిని సింఫుల్‌గా పీఎం కిసాన్ పథకం అంటారు. గత ఎన్నికలకు ముందే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఆర్థిక సాయం చేస్తోంది.
ఈ పథకం నగదును నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తుంది. రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా ప్రతి ఏడాది ఈ నగదును అందిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత డబ్బులను త్వరలో కేంద్ర ప్రభుత్వం జమ చేయనుంది. ఈ నెల చివరిలోపు జమ చేసే అవకాశాలున్నాయి.
అయతే కొంతమంది ఈ పథకానికి అప్లై చేసినా డబ్బులు జమ కాలేదని ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. డబ్బులు రాకపోవడానికి కారణం మీ అప్లికేషన్‌లో ఏవైనా తప్పులు ఉంటే డబ్బులు జమ కావు. వాటిని సవరించుకుని మళ్లీ కొత్తగా అప్లై చేసుకోవడం ద్వారా డబ్బులు పొందవచ్చు. అలాంటి వారు ఈ క్రింది విధంగా చేస్తే మీకు డబ్బులు వచ్చే అవకాశముంది.
తప్పులు సవరించుకోవడం ఎలా?
-పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్‌లోకి వెళ్లండి
-అందులోని ఫార్మర్స్ కార్నర్ మీద క్లిక్ చేసి సెల్ప్ రిజిస్టర్డ్ ఫార్మర్ ఆఫ్షన్ ఎంచుకోండి
-ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయండి
-ఆ తర్వాత మీ రిజిస్ట్రేషన్ ఫామ్ కనిపిస్తుంది. అందులో ఏమైన తప్పులు ఉంటే సరిచేసుకుని సమ్మిట్ బటన్ క్లిక్ చేయండి
Share your comments