ప్రస్తుత కాలంలో కూరగాయల ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఇంట్లోనే కూరగాయల పెంపకం కూడా ఎక్కువైంది. చాలామంది తమ ఇంటి పరిసరాల్లో ఖాళీగా ఉండే స్థలాల్లో కూరగాయలను పండిస్తున్నారు. సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ ఇంట్లోనే తమ అవసరాలకు సరిపోయే విధంగా కూరగాయలను పండిస్తున్నారు. దీని వల్ల ఇంటి పరిసరాలు అందంగా, ఆహ్లాదంగా ఉండటంతో పాటు కూరగాయలకు పెట్టే ఖర్చు ఆదా అవుతుంది.
పెరటి తోటల పెంపకం ఎలా?
ఇంటి సరిసరాల్లోని ఖాళీ స్థలాలను శుభ్రం చేయండి. ఆ తర్వాత 30 నుంచి 40 సెంటిమీటర్ల లోతు వరకు తవ్వాలి.. రాళ్లు ఏవైనా ఉంటేనే వాటిని తొలగించాలి. ఆ తర్వాత సేంద్రీయ ఎరువులను మట్టిలో కలపాలి. ఆ తర్వాత గట్లు కట్టుకోవాలి. ఆ తర్వాత మొత్తం చదును చేసుకోవాలి. ఆ తర్వాత విత్తనాలను తీసుకువచ్చి నాటాలి.
ఏం ఏం పండించవచ్చు?
బెండ, తోటకూర, పుదినా, కొత్తిమీర, టోమాటో, మిరప, వంకాయ వంటి వాటిని పండించుకోవచ్చు. ఇక టోమాటో, వంకాయ, మిరప వంటి వాటిని నాటేటప్పుడు మట్టిలో వేప పిండిని కలిపితే చీమలు పట్టకుండా ఉంటాయి. టమాటో, వంకాయ, మిరప మొక్కలను 30 నుంచి 45 సె.మీ ఎడం ఉండాలి.
మొక్కలను నాటగానే వాటికి నీళ్లు పోయాలి. ఆ తర్వాత మళ్లీ మూడోరోజు పోయాలి. ఆ తర్వాత రెండు రోజులకోసారి, ఆ తర్వాత 4 రోజులకోసారి మాత్రమే నీళ్లు పోయాలి. ఏడాది పోడవునా పెరిగే చెట్లను తోటకు వెనుకభాగంలో పండించాలి.
ఎలాంటి క్రిమిసంహారక మందులు వేయకుండా సేంద్రీయ వ్యవసాయ పద్దతులను ఉపయోగించి పండిస్తే మన ఆరోగ్యానికి కూడా మంచిది.
ఏ సీజన్‌లో ఏది వేసుకోవచ్చు?
టొమాటో, ఉల్లిని జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వేసుకోవాలి. ఇాక ముల్లంగిని అక్టోబర్ నుంచి నవంబర్ వరకు, బీన్సు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు, బెండను మార్చి నుంచి మే వరకు వేసుకోవాలి. వంకాయను జూన్ నుంచి సెప్టెంబర్ వరకు, తోటకూర మేలో వేసుకోవాలి.
Share your comments