News

నేటి నుంచే రిజిస్ట్రేషన్లు.. టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా?

KJ Staff
KJ Staff

దేశంలో కరోనా విలయ తాండవం సృష్టిస్తోంది. కరోనా కేసులు రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి. చిన్నపిల్లలు కూడా కరోనా బారిన పడుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. తొలి వేవ్ కంటే ఈ సెకండ్ వేవ్ మరింత భయంకరంగా మారింది. యువత, చిన్నపిల్లలలో కూడా దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రోజుకి 3 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది.

దీంతో కరోనాను కట్టడి చేసేందుకు చాలా రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూతో పాటు లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. మరోవైపు ఆక్సిజన్ కొరత, బెడ్ల కొరత, రెమిడిసివిర్ కొరతతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇక హాస్పిటల్స్‌లలో కరోనా చికిత్స కోసం లక్షల్లో ఖర్చు అవుతుంది. కరోనా బారిన పడకుండా ఉండాలంటే మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం లాంటివి చేయాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరోవైపు కరోనా బారి నుంచి ప్రజలను కాపాడేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. ఇప్పటికే 45 సంత్సరాలు పైన వయస్సు ఉన్న వారికి వ్యాక్సిన్ ఇవ్వగా.. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వనుంది. దీని కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 28న సాయంత్రం 4 గంటల నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. కోవిన్ వెబ్ సైట్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి?

http://dashboard.covid19.ap.gov.in/ims/covidvaccine_centers/registration.pdf#page=4

1. కొవిన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్టర్/ సైన్ ఇన్ యువర్‌సెల్ఫ్ బటన్ మీద క్లిక్ చేయాలి
2. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మొబైల్ నెంబర్‌కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి
3. ఆ తర్వాత ఫొటో ఐడీ ప్రూఫ్ ఐడీని సెలక్ట్ చేసుకోవాలి
4. తర్వాత ఐడీ ప్రూఫ్‌లోని నెంబర్‌ను ఎంటర్ చేయాలి
5. ఇక ఫొటో ఐడీ ప్రూఫ్‌లో పొందుపరిచిన విధంగా వివరాలు ఇవ్వాలి
6. ఆ తర్వాత మీరు దగ్గల్లోని వ్యాక్సిన్ కేంద్రం, ఏ రోజున వేయించుకుంటారనేది సెలక్ట్ చేసుకోవాలి.

ఏ ఏ పత్రాలు కావాలి

మొబైల్ నెంబర్
ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు లేదా ఓటర్ ఐడీ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్, ఉపాధి హామీ కార్డు లేదా పాస్ పోర్టు కావాలి

Related Topics

cowin, vaccine, corona,

Share your comments

Subscribe Magazine

More on News

More