సామాన్యులకు భారీ షాక్ తగిలింది. వంట గ్యాస్ సిలిండర్ ధరల భారం సామాన్యులపై పడనుంది. దేశంలో ప్రతి నెల గ్యాస్ సిలిండర్ ధరలు మారుతూనే ఉంటాయి. అదేవిధంగా ఈ నెలలో కూడా వంట గ్యాస్ సిలిండర్ ధరలు మారాయి. గ్యాస్ సిలిండర్ ధరల్లో వచ్చిన మార్పులు ఈ నెల 1వ తేదీ నుంచి అందరికి వర్తిస్తుంది.
గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. ఇదివరకటిలా కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రమే పెరగలేదు. వాణిజ్యానికి వాడే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు వంటకు ఇంట్లో వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరిగాయి. 8 నెలల నుండి మొదటిసారిగా డొమెస్టిక్ సిలిండర్ ధర పెరిగింది. వంట గ్యాస్ సిలిండర్ పై రూ.50 మేరకు పెంచింది.
మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఫిబ్రవరి 28 వరకు వంటకు వినితోగించే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర 1053 రూపాయలుగా ఉన్నట్లయితే, మర్చి 1వ తేదీ అనగా ఇవాళ నుంచి 1103 రూయాయలకు చేరింది. మరోవైపు వాణిజ్యానికి వాడే కమర్షియల్ సిలిండర్ ధర నిన్నటి వరకు రూ.1769 ఉండగా, ఇవాళ్టి నుంచి ఆ ధర రూ.2119 చేరుకుంది. అంటే కమర్షియల్ సిలిండర్‌పై ఏకంగా 350 రూపాయల వరకు పెరిగింది.
ఇది కూడా చదవండి..
పడిపోయిన పత్తి ధర.. నష్టాల్లో రైతులు
ఇక కోల్‌కతా గురించి చూస్తే ఇక్కడ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1870 నుండి రూ. 2221కు పెరిగింది. ముంబైలో రూ. 2071కు మరియు చెన్నైలో ఈ సిలిండర్ ధర రూ. 2268ల వరకు చేరుకుంది. హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.1105 నుండి రూ. 1155కు పెరిగింది. ముంబైలో రూ. 1102.50కు, కోల్‌కతాలో రూ. 1129కి మరియు చెన్నైలో రూ. 1118.50కి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి.
ప్రతి సంవత్సరం ఒక్కో కుటుంబానికి 12 సిలిండర్ ధరలను సబ్సిడీ ధరలను కేంద్రం అందిస్తుంది. అంతకన్నా ఎక్కువ కావాలి అనుకుంటే మార్కెట్ ధరలతో వినియోగదారులు మార్కెట్ లో సీలిండర్లను కొనుక్కోవాలి.
ఇది కూడా చదవండి..
Share your comments