News

సోమని సీడ్స్ వారి 'ఎక్స్- 35' హైబ్రిడ్ రకం ముల్లంగి... దీనిని సాగు చెయ్యడం ద్వారా ఎకరానికి 3 లక్షలు పొందే అవకాశం

KJ Staff
KJ Staff

ఎక్స్-35 హైబ్రిడ్: ఖరీఫ్ సీజన్లో, ముల్లంగి సాగు చేప్పట్టే రైతులు సోమని సీడ్స్ వారు అభివృద్ధి చేసిన ఎక్స్-35 హైబ్రిడ్ రకం ముల్లంగి రైతులకు ఒక ఉత్తమమైన ఎంపిక. ఈ రకం సాగు చేప్పట్టడం ద్వారా అధిక దిగుబడులు సొంతం చేసుకోవడంతో పాటు, రేటింపు ఆదాయం కూడా పొందే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం, రైతులు సాంప్రదాయ పంటల స్థానంలో కొత్త రకాల పంటలను సాగు చెయ్యడానికి ఆసక్తి చూపుతున్నారు, ఇందుకు అనుగుణంగా తక్కువ ఖర్చుతో, తక్కువ సమయం మరియు తక్కువ శ్రమతో గరిష్ట లాభాలు అందించే పంటల మీద రైతులు ద్రుష్టి సారిస్తున్నారు. ఆ పంటల్లో ముల్లంగి కూడా ఒకటి. ముల్లంగిని ప్రధానంగా పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పంజాబ్ మరియు అస్సాంతో సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో వాణిజ్యపరంగా పండిస్తారు. ముల్లంగి, తక్కువ సమయంలో మంచి ఉత్పత్తిని ఇవ్వడమే కాకుండా, సాంప్రదాయ పంటలకు ధీటుగా అధిక ఉత్పత్తిని కూడా ఇస్తుంది. ముల్లంగి సాగు చేయాలనే ఆలోచనలో రైతన్నలు ఉన్నట్లయితే, ఈ సీజన్‌లో హైబ్రిడ్ రకం ముల్లంగి 'ఎక్స్-35' సాగు చేయడం ద్వారా మంచి లాభం పొందవచ్చు.

ముల్లంగిని ఎప్పుడు పండించాలి?

దేశంలోని అనేక రాష్ట్రాల్లో, ముల్లంగిని దాదాపు ఏడాది పొడవునా సాగు చేస్తారు, అయితే చాలా రాష్ట్రాల్లో, ముల్లంగి యొక్క వాణిజ్య సాగు సాధారణంగా రబీ సీజన్‌లో జరుగుతుంది. రబీ సీజన్‌లో ముల్లంగిని సెప్టెంబరు నుండి జనవరి వరకు సాగు చేస్తారు, వేసవి కాలం మార్చి-ఏప్రిల్‌లో మరియు ఖరీఫ్ సీజన్‌లో జూన్ నుండి ఆగస్టు వరకు సాగు చేస్తారు. పంట నుండి అధిక దిగుబడి కోసం, రైతులు లోతైన మరియు ఇసుకతో లోమీ నేలలో సేంద్రీయ పదార్థంతో కూడిన వర్మీకంపోస్ట్‌ను ఉపయోగించడం ద్వారా ముల్లంగి యొక్క మంచి ఉత్పత్తిని పొందే అవకాశం ఉంటుంది.

ముల్లంగి హైబ్రిడ్ రకం X-35

భారతదేశంలో ప్రముఖ విత్తనోత్పత్తి సంస్థ సోమాని సీడ్జ్ అభివృద్ధి చేసిన కొత్త ముల్లంగి రకం హైబ్రిడ్ ఎక్స్-35 చిన్న రైతులకు వరంలా మారింది. దీని సాగు చెయ్యడం ద్వారా రైతులు భారీ లాభాలు పొందుతున్నారు, కాబట్టి ఈ రకాన్ని సాగు చేసేందుకు రైతులు ఎక్కువగా ఆసక్తిచూపుతున్నారు. X-35 ముల్లంగికి పెరుగుతున్న జనాదరణ మరియు మెరుగైన ఫలితాలను చూసి, కంపెనీ ఈ మెరుగైన విత్తనాలను ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, పంజాబ్ హర్యానా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ మరియు ఒరిస్సాతో సహా అనేక రాష్ట్రాల్లో విక్రయిస్తోంది.

ముల్లంగి హైబ్రిడ్ రకం X-35 యొక్క లక్షణాలు


• 'HY RADISH X-35' రకం 18-22 సెం.మీ పొడవు ఉంటుంది.
• ముల్లంగి బరువు సుమారు 300-400 గ్రాములు.
• ఈ రకం దాదాపు 22-25 రోజులలో సిద్ధంగా ఉంటుంది.
• ఈ రకం ద్వారా రైతుకు ఎకరానికి సుమారు మూడు లక్షల రూపాయల లాభం వస్తుంది.
• రైతులు ఈ రకమైన ముల్లంగిని తమ పొలాల్లో ఫిబ్రవరి 20 నుండి నవంబర్ 15 వరకు విత్తుకోవచ్చు.

సోమాని సీడ్జ్ స్పాన్సర్ చేసిన MFOI-2024లో ముల్లంగి రైతు క్యాటగిరి

మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డ్ - 2024లో దాదాపు 300 కేటగిరీలు ఉన్నాయి, వీటిలో మిలియనీర్ హార్టికల్చర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా - ముల్లంగి కూడా ఒకటి. ఈ వర్గాన్ని సోమాని సీడ్జ్ కంపెనీ స్పాన్సర్ చేసింది. మీరు ముల్లంగి పండిస్తూ, లక్షల్లో ఆదాయం పొందుతున్నట్లైతే, అలాగే మీ వార్షిక ఆదాయం రూ. 10 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, ఈ విభాగంలో అవార్డు పొందడానికి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఇక్కడ ఉన్న లింక్ మీద క్లిక్ చేసి, మీ వివరాలను నింపి, ఈ అవార్డును సొంతం చేసుకోవచ్చు.

సోమాని సీడ్జ్ కంపెనీ అంటే ఏమిటి?

సోమాని సీడ్స్ కంపెనీకి కూరగాయల విత్తనాలను అభివృద్ధి చేయడంలో చాలా సంవత్సరాల అనుభవం ఉంది. సోమాని సీడ్స్ అన్ని వాతావరణాలకు అనుగుణంగా సాధారణ మరియు హైబ్రిడ్ రకాల కూరగాయలను క్రమమైన వ్యవధిలో అభివృద్ధి చేస్తూనే ఉంది. సోమాని సీడ్జ్ కంపెనీ నాణ్యమైన, అధిక దిగుబడినిచ్చే విత్తనాలను రైతులకు అందజేస్తూ వ్యవసాయ లాభాల్లో ముఖ్యపాత్ర పోషిస్తోంది.

Share your comments

Subscribe Magazine

More on News

More