హైదరాబాద్ నగరవాసులు ఎన్నాళ్లనుంచో ఎదురు చూస్తున్న డబల్-డెక్కర్ బస్సులు నగరానికి విచ్చేసాయి. అప్పటి డబల్-డెక్కర్ పూర్వవైభవాన్ని సంతరించుకుంది. ఒక నెటిజెన్ చేసిన ట్విట్ కు స్పందించిన ,మంత్రి కె.టి.ఆర్ ఆ అందమైన అనుభవాన్ని మళ్లి నాగరాల్లోకి తీసుకువస్తామని చెప్పారు. ఇచ్చిన మాట మేరకు, తెలంగాణ రవాణా శాఖ డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను నగరానికి తీసుకు వచ్చింది. నిన్న మంత్రి కేటీఆర్ మూడు డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించారు.
సందర్శకులను, జాతీయ మరియు అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఈ మూడు డబుల్ డెక్కర్ బస్సులను హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటడ్ కార్యాలయం వద్ద పచ్చ జెండా ఊపారు. మంత్రి కేటీఆర్ తో పాటు ఎంపీ రంజిత్ కుమార్, ఎంఐఎం అక్బరుద్దీన్ ఒవైసి, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు. ప్రస్తుతానికి ఈ మూడు బస్సులు నగరంలో పరుగులు పెట్టనున్నాయి. త్వరలోనే మరో మూడు బస్సులను అందుబాటులోకి తీసుకురానునట్లు అధికారులు చెప్పారు.
ఫార్ములా -ఈ ప్రిక్స్ సందర్భంగా ప్రారంభించిన ఈ బస్సులు ప్రస్తుతం ట్యాంకుబండ్, నెక్ల్స్స్ రోడ్, ప్యారడైస్, నిజం కాలేజీ రోడ్ రూట్లో తిరుగుతాయి. దశల వారీగా మొత్తం 20 బస్సులను ప్రారంభించేందుకు హెచ్ఎండిఏ ప్రణాలికను సిద్ధం చేసింది. తర్వాత ఈ బస్సులను వారసత్వ మరియు చారిత్రక ప్రదేశాల వైటు నడపనున్నారు. ఈ నెల 11న ఫార్ములా -ఈ పోటీల సందర్భంగా ఉచితంగా ఈ బస్సులలో ప్రయాణించే అవకాశం కల్పించనున్నారు.
ఇది కూడా చదవండి..
రైతుల సాధికారత కోసం వ్యవసాయ యాంత్రీకరణ..
ఈ డబుల్ డెక్కర్ బస్సులు నీలం రంగులో ఉన్నాయి. అందులో ప్రయాణం ఆస్వాధించాలన్న కుతూహలం కలిగేలా స్టైలిష్‌గా ఉన్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ బస్సుల మాదిరిగానే.. కింది భాగంలో సీటింగ్ ఉండగా.. ఇందులో పైన కూడా అదనంగా సీటింగ్ ఉంది. పెద్ద పెద్ద అద్దాలతో ఎంతో హుందాగా.. ఉన్న ఈ బస్సులు.. అమెరికా లాంటి దేశాల్లో తిరిగే బస్సులను తలపిస్తున్నాయి. అయితే.. కొన్ని బస్సులకు ఓపెన్ టాప్ కూడా ఉంది. నగరంలో ప్రముఖ ప్రాంతాల మధ్య పరుగులు తీయనున్న ఈ డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయాణించే వాళ్లు... జర్నీతో పాటు హైదరాబాద్ అందాలను ఆస్వాధించేలా.. బస్సులకు ఓపెన్ టాప్ ఇవ్వటం విశేషం. ఏ ఏ రూట్లలో ప్రయాణిస్తున్నాయన్న వివరాలు ప్రదర్శించేలా పెద్దగా డిస్‌ప్లే కూడా ఉంది.
నిజాం కాలంలోనే ప్రవేశ పెట్టిన ఈ డబుల్ డెక్కర్ బస్సులను గ్రేటర్ హైదరాబాద్ జోన్ 2003 వరకు నడిపింది. ఈ బస్సులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి జూపార్కు వరకు అఫ్జల్గంజ్ వరకు ఇవి నడిచేవి. ఓ నగరానికి వచ్చే వారితో పాటు ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు ఈ బస్సులలో ప్రయాణించేందుకు ఎంతగానో ఇష్టపడేవారు. ట్యాంకుబండ్ మీదుగా ఈ బస్సులో ప్రయాణించడం అనేది ఒక గొప్ప అనుభూతి. కాలక్రమేణా నిర్వహణ భారంగా మారడం మరియు ఫ్లై ఓవర్ల కారణం వీటిని నడపటం కష్టం అవ్వింది. ప్రతుతం మంత్రి కేటీఆర్ కారణంగా ఆధునిక సామర్ధ్యంతో మల్లి ఈ బస్సులు అందుబాటులోకి వచ్చాయి.
ఇది కూడా చదవండి..
Share your comments