News

హైదరాబాద్‌ :ఏప్రిల్లో దశాబ్దంలోనే మూడవ అత్యధిక వర్షపాతం నమోదు!

KJ Staff
KJ Staff

హైదరాబాద్: హైదరాబాద్ జిల్లాలో, గత 28 రోజులలో 49. 1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, మొత్తం దశాబ్దంలో ఈ ఏప్రిల్‌ నెల మూడవ అత్యంత అధికమైన వర్షపాతం నమోదైనదిగా తెలుస్తుంది. సాధారణంగా ఎప్పుడు ఏప్రిల్ లో నమోదయ్యే వర్షపాతం 15.5 mm .

రాష్ట్రంలో రెండు దశాబ్దాలలో రెండవ అత్యధిక వర్షపాతం ఎక్కువున్న ఏప్రిల్‌లో, సాధారణ వర్షపాతం 11. 4 mm కి వ్యతిరేకంగా 43.2 mm వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో 2015 ఏప్రిల్‌లో మొదటి అత్యధిక వర్షపాతం 105. 6 mm ,దాని తర్వాత 2019లో 52. 1 mm వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉండగా, 2015 ఏప్రిల్‌లో 68. 2 మిల్లీమీటర్ల వర్షపాతంతో తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదైంది.

మొత్తంగా, గత ఒక సంవత్సరంలో (జూన్ 1 , 2022 నుండి ఏప్రిల్ 28, 2023 వరకు) నమోదైన వర్షపాతం 1,310.6 mm సాధారణం గ నమోదయ్యే 877.2 mm తో పోలిస్తే , ఇది 49% పెరుగుదల ఉన్నట్టు కనిపిస్తుంది.

రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలకు అనేక కారకాల కలయికే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. "సాధారణంగా, ఉపరితలం వేడెక్కడం వల్ల ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నప్పుడు, గాలిలో తేమ శాతం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అప్పుడు మేఘాలు ఏర్పడటం వల్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి" అని భారత వాతావరణ శాఖ (IMD) సీనియర్ అధికారి వివరించారు.

ఇది కూడా చదవండి

పుట్టగొడుగులు ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం అని మీకు తెలుసా?


అయితే, "ఈ వారం విదర్భపై అల్పపీడనం ఏర్పడిందని, ఇది ఆగ్నేయ ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తేమతో కూడిన గాలులు లాగుతున్నదని, ఈ కారకాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా వేగంగా మేఘాలు ఏర్పడి అకాల వర్షాలు కురుస్తాయని అధికారి తెలిపారు.ఈ కారణాల మూలంగా తేమ శాతం 70% చేరిందని, ఇలా ఏప్రిల్‌లో జరగడం చాలా అసాధారణమైనది" అని అయన తెలిపారు.

ఇది కూడా చదవండి

పుట్టగొడుగులు ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం అని మీకు తెలుసా?

Share your comments

Subscribe Magazine

More on News

More