హైదరాబాద్: మధుమేహం టైప్ 1, టైప్ 2 వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ప్రభావవంతంగా నిరూపించబడిన చికిత్సను అభివృద్ధి చేశామని హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఇంక్యుబేట్ అయిన రీజెన్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్-అప్ శాస్త్రవేత్తలు ప్రకటించారు.
మధుమేహం అత్యంత ఎక్కువగా ప్రజలను బాధిస్తున్న వ్యాధి, దాంట్లో ఎక్కువ ప్రభావితమైన టైప్ 2 రకం భాదితులు , మన దేశం లోనే అధికంగా ఉన్నారు. మధుమేహానికి ఇప్పటికే అనేక మందులు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే అవి వాడుతున్నప్పటికీ
50-60 శాతం మంది రోగులు రక్తంలో చక్కెరను ఆరోగ్యకరమైన స్థాయికి తీసుకురాలేకపోతున్నారు.కాబట్టి ఈ ఔషధాల కంటే మేలైనది ఏదైనా అవసరమని భావించి ఈ సంభావ్య చికిత్స యొక్క ఆలోచనతో ముందుకు వచ్చాము ,అని రీజీన్ యొక్క ప్రధాన శాస్త్రవేత్త మరియు సహ వ్యవస్థాపకుడు డాక్టర్ ఉదయ్ సక్సేనా తెలిపారు.
రక్తంలో ఉండే 70 శాతం గ్లూకోజ్ ఆహారం నుండి తీసుకోబడుతుంది ; చిన్న ప్రేగులలో చక్కెర శోషణ నిరోధించబడితే, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు.ఇదే ఈ చికిత్స. పేగు గ్లూకోజ్ శోషణ నిరోధించడాని కోసం , శాస్త్రవేత్తలు గ్లూకోజ్‌ను రవాణా చేసే SGLT1 అనే ప్రోటీన్‌కు చికెన్ యాంటీబాడీలను అభివృద్ధి చేశారు. జంతు నమూనాలలో, ప్రతిరోధకాలను ఉపయోగించడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు మరియు గ్లైసెమిక్ ప్రొఫైల్ మెరుగుపడింది.
ఇది కూడా చదవండి
Stevia: చెక్కెరకు 200 రేట్లు తీయగా ఉండే సహజ ప్రత్యామ్నాయం! ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో
"ప్రతిపాదిత ఔషధం ప్రేగులలోని ఆహారం నుండి చక్కెరను శోషించడాన్ని నిరోధిస్తుంది మరియు తద్వారా రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. ఈ ఔషధాన్ని మధుమేహం మందులకు అనుబంధంగా తీసుకోవచ్చు," డాక్టర్ సక్సేనా చెప్పారు.
ఈ ఔషధానికి సంబంధించిన క్లినికల్ ట్రయల్ త్వరలో ప్రారంభమవుతుంది. ఆమోదించబడితే, ఔషధం ఒక టాబ్లెట్ లేదా పానీయం ద్వారా , ఆహారానికి ముందు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇది దీర్ఘకాలికంగా వాడడం వాళ్ళ క్రమేణా ఇతర మందుల వాడకం తగ్గించేయొచ్చంట. ఈ ఔషధం మానవులలో విజయవంతమైతే రక్తంలో చక్కెరను మెరుగ్గా నియంత్రించడం కోసం షుగర్ వ్యాధి గరస్థులు చేసే పోరాటం లో కీలకంగా సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి
Share your comments