'భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో ముఖ్యమైన కూరగాయల పంటకు ఫై బయో ఇంటెన్సివ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్ మెంట్' అనే అంశంపై ఐసిఎఆర్ రీసెర్చ్ కాంప్లెక్స్ యొక్క క్రాప్ సైన్స్ విభాగం శిక్షణ నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి రి-భోయ్ జిల్లా నెట్ వర్క్ ప్రాజెక్ట్ ఆన్ ఆర్గానిక్ ఫార్మింగ్ (ఎన్ పిఒఎఫ్) కింద దత్తత తీసుకున్న గ్రామం అయిన పింథోర్ గ్రామానికి చెందిన 35 మంది రైతులు పాల్గొన్నారు . మూడు రోజుల శిక్షణా కార్యక్రమం ప్రధానంగా బయో-ఇంటెన్సివ్ మేనేజ్ మెంట్, ఈ ప్రాంతంలో ప్రధాన పంట వ్యాధులు మరియు ముఖ్యమైన కీటకాల చీడల -పీడల నివారణ పై శిక్షణ నిర్వహించింది
. సంబంధిత అంశాలపై ఆయా విభాగాల నిపుణుల ద్వారా రైతులకు క్షుణ్నంగా వివరించారు, సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత అనే అంశం కూడా చర్చించబడింది. రైతులు మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమం సందర్భంగా పంట వ్యాధులు మరియు కీటకాల చీడల విషయాలపై ప్రత్యక్ష ప్రదర్శనలు కూడా నిర్వహించబడ్డాయి.
పండ్ల ఫ్లై ట్రాపింగ్ పరికరాలు, కూరగాయల విత్తనాలు మరియు బయో పెస్టిసైడ్స్ వంటి ఇన్ పుట్ లు రైతులకు ఇవ్వబడ్డాయి. రైతు-శాస్త్రవేత్త పరిచయం చేసుకోవడం అనేది ప్రధాన ఉద్దేశం , మరియు రైతుల యొక్క ప్రశ్నలకు ఐసిఎఆర్ కు చెందిన శాస్త్రవేత్తలు సమాధానాలను ఇచ్చారు. రైతు ఉత్పత్తిదారు సంస్థ (ఎఫ్ పిఒ) మరియు స్టార్ట్-అప్ పై ఒక రోజు సెమినార్ ను అగ్రిబిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్. హైదరాబాద్ లోని ఎన్ ఏఆర్ ఎం, ఏ-ఐడియా సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ఐసిఎఆర్ డైరెక్టర్ డాక్టర్ వికె మిశ్రా తన ప్రారంభోత్సవ ప్రసంగం లో , రైతులు నాణ్యమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయాలని, తద్వారా వారు తమ స్వంత బ్రాండ్ నుఏర్పరుచుకోవచ్చని వారు తెలిపారు.
Share your comments