తెలంగాణ రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఐకేపీ సెంటర్లలో ధాన్యం కంట అయిన వడ్లు దించుకోవడంలో మాత్రం మిల్లర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అదే విషయమై నిన్న సివిల్ సప్లయ్స్ మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఎట్టి పరి స్థితుల్లోనూ అన్ లోడింగ్ విషయంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది పడకుండా ,రైతులు రోడ్లపై రాకుండా చూడాలని అవసరమైతే తక్షణ పరిష్కారం కోసం ఇంటర్మీడియె ట్ గోదాములు ఏర్పాటు చేయాలని సూచించారు.
రాష్ట్రంలో అక్కడక్కడ మి ల్లర్లు అన్ లోడింగ్ చేసుకోవడం లేదని, ట్రాన్స్ పోర్టు సమస్యలు వస్తున్నాయని మంత్రి చెప్పారు. ఇలాంటి ప్రాంతాల్లో తక్షణ పరిష్కారం కోసం ఇంటర్మీడియె ట్ గోదాములు ఏర్పాటు చేయాలని సూచించారు. ఒకవేళ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు అవకాశం లేకపోతే పక్క జిల్లాలో అన్ లోడింగ్ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు .
ఇది కూడా చదవండి .
Vanakalm Rice Varieties telangana :వానాకాలం లో సాగుకు అనువైన వరి రకాలు!
అదేవిధంగా తలు తరుగు పేరుతో రైతులను మిల్లర్లు ఇబ్బందులు కల్గించకుండా చూడాలని అధికారులే బాధ్యత తీసుకొని ఈ ససమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు . పక్క రా ష్ట్రాల్లోని ధాన్యం రాష్ట్రానికి రాకుండా చర్యలు తీసుకో వాలి” అని సూచించారు.
కాగా రాష్ట్రవ్యాప్తంగ రైతులను ఇప్పటికి తలు ,తరుగు పేరుతో మిల్లర్లు దోచుకుంటున్నారు , అధికారులు ఎంత హెచ్చరించిన కోతలు ఇంకా కొనసాగుతున్నాయి యాదాద్రి జిల్లాకు చెందిన రాజు అనే రైతు కృషి జాగరణ్ తో తెలిపారు .
Share your comments