ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) కాన్పూర్ పరిశోధకులు బాక్టీరియా మరియు ఫంగస్ సంక్రమణల నుండి పంటలను రక్షించడానికి రసాయన ఆధారిత పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించగల జీవవిచ్ఛిన్న సూక్ష్మకణాలను రూపొందించారు. బయోడిగ్రేడబుల్ కార్బొనాయిడ్ మెటాబోలైట్ (బయోడిసిఎమ్) అని పిలువబడే సూక్ష్మకణాలు తక్కువ గాఢతవద్ద చురుకుగా ఉండవచ్చు మరియు మట్టి లేదా వినియోగదారుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపనప్పటికీ పురుగుమందుల వలె సమర్థవంతంగా ఉంటాయి.
బయోడిగ్రేడబుల్ కార్బొనాయిడ్ మెటాబోలైట్ గురించి (బయోడిసిఎమ్):
ఐఐటి కాన్పూర్ ప్రకారం, ఈ సూక్ష్మకణాలు త్వరగా పనిచేస్తుంది ఎందుకంటే ఇది బయోయాక్టివ్ రూపంలో అప్లై చేయబడుతుంది మరియు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలదు. ఐసిఎఆర్-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ కు చెందిన సి.కన్నన్ మరియు దివ్య మిశ్రా, అలాగే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి ఆర్ బాలమురుగన్ మరియు మౌ మండల్ సహకారంతో దీనిని రూపొందించారు.
ఐఐటి కాన్పూర్ డైరెక్టర్ అభయ్ కరండికర్ ప్రకారం, "రైతులు రసాయన పురుకుమందులను పిచికారీ చేయడంవల్ల వివిధ సవాళ్లను ఎదుర్కొంటున్నారు, పర్యావరణ వ్యవస్థను కూడ దెబ్బతింటుంది దీనిని మెరుగుపరచడానికి మేము అవిశ్రాంతంగా కృషి చేసాము.
ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) జూన్ 2021 నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా రైతులు ప్రతి సంవత్సరం కీటకాలు మరియు వ్యాధుల బారిన పట్టడటం వల్ల తమ పంటలలో 40% వరకు కోల్పోతారు.
ఐఐటి కాన్పూర్ పంట దిగుబడిని పెంచడానికి మరియు భారతీయ వ్యవసాయం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడానికి అనేక పరిష్కారాలను అభివృద్ధి చేసింది. ఉదాహరణకు, డిసెంబర్ 2021లో, ఈ సంస్థ భూ పరీక్షక్ అనే మట్టి పరీక్షా పరికరాన్ని ప్రారంభిస్తుంది, ఇది మట్టి లో ని పోషకాలను 90 సెకన్లలో కొలవగలదు.
ఐఐటి కాన్పూర్ వాస్తవ ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో చాలా చురుకుగా ఉంది. కోవిడ్-19 మహమ్మారి సమయం లో , సంస్థ తిరిగి ఉపయోగించగల మాస్కులు , వంటి కొన్నిసమస్య లకు పరిష్కారాలను చూపగల్గింది .
ఇంకా చదవండి .
రైతులకోసం కిసాన్ యాప్‌ను రూపొందించిన - IIT రూర్కీ !
Share your comments