News

సెప్టెంబరు 7 మరియు 8 తేదీలలో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు !

KJ Staff
KJ Staff
IMD ALERT : Heavy rainfall expected in parts of Andhra Pradesh on Sept 7 and 8; Orange alert for 9 Districts
IMD ALERT : Heavy rainfall expected in parts of Andhra Pradesh on Sept 7 and 8; Orange alert for 9 Districts

రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని తొమ్మిది జిల్లాల్లోని పలు  ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఆయా జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

ఏలూరు, అల్లూరి సీతారామరాజు (ఏఎస్‌ఆర్‌), పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరంజ్  అలర్ట్‌  ప్రకటించింది.

ఏలూరు, ASR, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి మరియు NTR (జిల్లాలు) ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు మరియు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదేవిధంగా  కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, యానాం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం , శనివారం ఉదయం 8:30 గంటలకు మధ్య మరియు ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంపై అల్ప పీడనం ఏర్పడింది.

సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ ఎత్తు వరకు నైరుతి దిశగా ఎత్తుతో విస్తరించి ఉంది. ఇది నెమ్మదిగా దాదాపు ఉత్తరం వైపుకు వెళ్లి వాయువ్య బంగాళాఖాతం మరియు గంగా పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా మరియు బంగ్లాదేశ్ తీరాలకు ఆనుకుని ఉన్న ప్రాంతాలలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని కారణముగా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Related Topics

ap rain alert

Share your comments

Subscribe Magazine

More on News

More