రానున్న రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) విశాఖపట్నం తెలిపింది.
లోతైన అల్పపీడనం ప్రభావంతో, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం మరియు దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ (SCAP).
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనిఅదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని(ఐఎండీ) విశాఖపట్నం వాతావరణ శాఖ తెలిపింది .
మరో వైపు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ లోని కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రానున్న 24 గంటల్లో ఈ జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
పలు జిల్లాలు కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి లకు ఆరెంజ్ అలర్ట్ జారీ జారీ చేసింది.
సోమ మరియు మంగళ వారాలలో తెలంగాణ లోని ఆదిలాబాద్, కొమరం భీమ్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో సహా పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
Share your comments