రెండు తెలుగు రాష్ట్రాలలో రానున్న మూడు రోజులు 25 నుంచి 28 వరకు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ సూచనలను జారీచేసింది. తెలంగాణలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిశాయి.గురువారం నుంచి 28 వరకు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారీ వర్షాలు కురిసే సూచనలు లేవని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 2 మధ్య విరామం అనంతరం సెప్టెంబర్ 3 తర్వాత రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు ఉత్తర, తూర్పు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
రూ. 2 లక్షల పంట రుణాలు తీసుకోండి.. డిసెంబర్ లో మాఫీ చేస్తాం
ఏపీలోని అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి నెల్లూరు, పార్వతీపురం మన్యం, జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా చిరుజల్లులు కురిశాయి. రానున్న రెండు రోజులలో కూడా ఆంధ్రా ప్రదేశ్లో అక్కడక్కడా చిరుజల్లులు కురిసే అవకాశంవుందని వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Share your comments