తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడా నిన్న ,మొన్న కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసాయి .. మరియు రానున్న మూడు నాలుగురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది.
రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న రోజులలో ఆగస్టు 25వ తారీఖు నుంచి 28 వరకు మూడు రోజుల పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే భారీ వరహాలు కురిసే అవకాశాలు మాత్రం లేవని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. మళ్లీ సెప్టెంబర్ 3 తర్వాత తెలంగాణలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
కౌలు రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో వారికి కూడా రైతు భరోసా.!
నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని.. హైదరాబాద్ నగరం లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మిగతా ప్రాంతాల్లో మాత్రం పొడి వాతావరణమే కొనసాగనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్పపీడనం కారణంగా ఐదు రోజుల్లో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది . మళ్లీ సెప్టెంబర్ 3 తర్వాత తెలంగాణలో వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది.
Share your comments