రాష్ట్రంలో ఎండలు ఉక్కపోతలతో అల్లడుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లటి కబురును అందించింది. రానున్న నాలుగు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ జారీ చేసింది . 30-35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని , అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని హెచ్చరికలు జారీ చేసింది .
ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొమరం భీం , అసిఫాబాద్ , భద్రాద్రి ,కొత్త గూడెం , వరంగల్ , మహబూబ్నగర్ , జిల్లాల తోపాటు తెలంగాణ వ్యాప్తంగా గంటకు 30-45 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఆదివారం హైదరాబాద్ తో సహా రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఒక మోస్తరు వర్షాలు కురిసాయి , తర్వాత రెండు రోజులు దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో వానలు పడతాయని ఆదివారం వాతావరణ శాఖ బుల్లెటిన్ ను విడుదల చేసింది .
'రైతుబంధు' కొత్త దరఖాస్తుల స్వీకరణ ..!
రాష్ట్రంలో ఎండలు కూడా భారీగా నమోదవుతున్నాయి ఆదివారం అత్యధికంగా నల్గొండ జిల్లా నిడమనూరులో 46.1 డిగ్రీలు, దామరచర్లలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం, కరీంనగర్ జిల్లా తంగులలో 45.5 డిగ్రీలు, నల్గొండ జిల్లా కేతేపల్లిలో 45.3, మహబూబాబాద్ జిల్లా గార్ల, పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్, ములుగు జిల్లా తాడ్వాయి హట్స్లలో 45.2, ఖమ్మం జిల్లా ఖానాపూర్, కూసుమంచిలలో 45.1డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి .
Share your comments